‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోరుుంది..’ అన్న చందంగా ఉంది విజయవాడ నగరపాలక సంస్థ పరిస్థితి. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నవీనీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) ద్వారా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగరాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన నేతలు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కోట్ల రూపాయలు తీసుకురాకపోగా... నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆస్తులను తాకట్టు పెట్టేలా చేశారు.
ఇంతజరిగినా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద చేపట్టిన పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయూరుు. ఎన్నికలు సమీపించిన తరుణంలో అసలు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నగరానికి వరమా.. శాపమా... అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
సాక్షి, విజయవాడ :
జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నవీనీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) ద్వారా నగర రూపు రేఖలు మార్చేందుకు వేల కోట్ల రూపాయలు తీసుకువస్తామని ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఆచరణలో మాత్రం వందల కోట్ల రూపాయలకే పరిమితమయ్యూరు. ఫలితంగా నగరాభివృద్ధి జరగకపోగా.. షరతుల వల్ల నగరపాలక సంస్థ నడ్డివిరిగింది.
ప్రజలకే కాదు.. కాంట్రాక్టర్లకు కూడా కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వంద కోట్ల రూపాయలు దాటిపోవడంతో వారు కొత్త పనులు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. మంజూరై టెండర్లు పిలిచిన పనులకు కాంట్రాక్టర్లు దొరకని పరిస్థితి. ఒకే పనికి ఏడెనిమిదిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం నగరపాలక సంస్థ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికి మంజూరైన ప్రాజెక్టుల్లో 62 శాతం నిధులు మాత్రమే కార్పొరేషన్‌కు చేరుకున్నాయి. మిగిలిన 38 శాతం నిధులు ఇంకా రావాల్సి ఉంది.
విఫలమైన యంత్రాంగం...
ఈ పథకాన్ని ఉృపయోగించుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందింది. ఒక్కో ప్రాజెక్టు తీసుకుని అది పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్టు చేపట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అధికారులు మాత్రం అన్ని ప్రాజెక్టులు ఒకేసారి మంజూరు చేయించారు. కార్పొరేషన్ తన వాటా ఎలా సమకూర్చుకుంటుందన్న కనీస అవగాహన కూడా లేకుండా చేసిన పనులు కార్పొరేషన్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి.
ఆఖరికి తన వాటా సమకూర్చుకునేందుకు ఆస్తులను తనఖా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అప్పుల కోసం వస్త్రలత, ఐవీ ప్యాలెస్, కేబీఎన్ షాపింగ్ కాంప్లెక్సులను రూ.100 కోట్ల కోసం తనఖా పెట్టారు. మరో రూ. 50 కోట్ల కోసం కాళేశ్వరరావు మార్కెట్, సింగ్‌నగర్ ఎస్టీపీ, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తనఖా పెట్టేందుకు సిద్ధమయ్యారు. అభివృద్ధి పనులు సగంలోనే నిలిచిపోయినా షరతుల వల్ల ఇబ్బందులు మాత్రం కార్పొరేషన్‌కు పెరిగిపోయాయి.
రెండేళ్ల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్యూఆర్‌ఎం పథకానికి నిధులు రావడం ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టి తన అవసరాలకు వాడేసుకుంది. ఈ నిధుల కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధి బృందాలు వచ్చి హడావుడి చేసి వెళ్లాయి.
వైఎస్ హయాంలో..
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో విజయవాడను చేర్చే అవకాశం లేకపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి చుట్టుపక్కల గ్రామాలను కూడా చేర్చి ఈ పథకాన్ని మంజూరు చేరుుంచారు.
ఆయన స్ఫూర్తిని ఆ తర్వాత నాయకులు కొనసాగించలేకపోయూరు.
2006లో రూ.7,400 కోట్లతో సిటీ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను రూపొందిస్తే రూ.1,422 కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.
ఆరేళ్లలో నగరానికి 62 శాతం అంటే రూ.891 కోట్లు మాత్రమే వచ్చాయి.
జేఎన్‌ఎన్ యూ ఆర్‌ఎం వరమా...! శాపమా..!!
Published Wed, Mar 19 2014 3:27 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement