గజదొంగ అరెస్ట్ | Thief arrested in guntur | Sakshi
Sakshi News home page

గజదొంగ అరెస్ట్

Published Wed, Sep 23 2015 1:31 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Thief arrested in guntur

రూ.3 కోట్లకు పైగా విలువ చేసే ఆభరణాలను చోరీచేసిన గజదొంగ బోయినశెట్టి దేవేంద్రను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజీ సంజయ్ బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల15న గుంటూరు జిల్లా బాపట్ల మండలం చిందుపల్లి గ్రామంలో జాస్తి సాంబశివరావు ఇంట్లోకి చొరబడిన దేవేంద్ర రూ.3 కోట్లకుపైగా విలువచేసే బంగారు ఆభరణాలు,  వ్రజాలు,  ప్లాటినం ఉంగరాన్నితస్కరించాడు.

కేసు నమొదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దేవేంద్ర తో పాటు... దోచుకున్న బంగారాన్ని దాచిపెట్టే విషయంలో సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం విక్రయించడానికి మార్కెట్ ప్రాంతానికి వచ్చిన దేవేంద్రను అదుపులోకి తీసుకుని అతని నుంచి రూ 3 కోట్ల సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దోచుకున్న సొత్తునంతా.. దాచిపెట్టిన దేవేంద్ర రూ60లక్షల విలువ చేసే ప్లాటినం ఉంగరాన్ని మాత్రం వెండిదనుకుని చేతికి పెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement