దొంగల ముఠా అరెస్టు | thieves gang arrested | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్టు

Published Thu, Oct 24 2013 5:20 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

thieves gang arrested

సాక్షి, నల్లగొండ :  ప్రయాణికులుగా వాహనాల్లో ఎక్కి దోపిడీలు.. వినియోగదారులుగా పెట్రోల్ బంక్‌లకు వెళ్లి ఇంధనం నింపే వ్యక్తినే కిడ్నాప్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లే దొంగల ముఠాను మిర్యాలగూడ పోలీ సులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో 10 మంది యువకులు ఉన్నారు. వివిధ జిల్లాలకు చెందిన వీరిలో ఒకరు మినహా మిగిలిన వాళ్లంతా 25 ఏళ్లలోపు వారే. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ప్రభాకర్‌రావు నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవా రం వెల్లడించారు. ఎల్బీ నగర్ నుంచి వి జయవాడ వైపు వెళ్తున్న స్కోడా కారు ను ఆపి కొంతమంది వ్యక్తులు ప్రయాణికులుగా ఎక్కారు.

 

కొంత దూరం వెళ్లగానే డ్రైవర్‌ను చితకబాది కారుతో సహా పరారయ్యారు. ఇదే రీతిలో బీబీ నగర్ వద్ద ఇన్నోవా వాహనంలో ఎక్కి డ్రైవర్‌ను కొట్టి వాహనంతో ఉడాయించారు. ఆ త ర్వాత ఈ నెల 8వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో మిర్యాలగూడలోని ఓ పె ట్రోల్ బంక్‌కు వద్దకు చేరుకున్నారు. డీజి ల్ ఎంత పోయాలని అడుగుతుండగానే ఫిల్లింగ్ మన్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడినుంచి వెళ్లిపోయా రు. కత్తులతో బెదిరించి ఉన్న రూ.1000 తీసుకుని అతడిని వదిలిపెట్టారు. అదే రోజు రాత్రి వరుసగా వేములపల్లి వద్ద, నిజామాబాద్, సదాశివనగర్, బీబీ నగ ర్, చేగుంట పరిధిలో దోపిడీలు చేశారు.

 పట్టుబడింది ఇలా..
 వేములపల్లి పెట్రోల్ బంక్‌లో డబ్బుల కోసం ఫిల్లింగ్ మన్‌ను కిడ్నాప్ చేస్తున్న దృశ్యం సీసీ కెమెరాలకు చిక్కింది. బాధితుడి నుంచి సెల్‌ఫోన్ కూడా లాక్కున్నారు. వీటి ఆధారంగా విచారణ చేయగా దొంగల ఆచూకీ తెలిసింది. వీరిని పట్టుకుని విచారించగా.. నేరాలను ఒప్పుకున్నారు. వీరిలో నల్లగొండ జిల్లాకు చెందిన జెర్రిపోతుల భాను ప్రకాష్, ముసుకుల ప్రదీప్‌రెడ్డి, గౌరి సదానం రాకేశ్‌కుమార్, బొడ్డుపల్లి రమేష్, హైదరాబాద్‌కు చెందిన షేక్ సూర్య అలియాస్ ఫరూఖ్, వడ్డేపల్లి దుర్గారావు, తన్నీరు సాయికుమార్, యాదోసు శివకుమార్ (మెదక్), తోక వెంకటేష్ (నెల్లూరు), ఇస్తారి వేణు (వరంగల్) జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరి నుంచి మూడు వాహనాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.5 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement