సాక్షి, కడప: ఏపీఎస్ ఆర్టీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) బస్సులలో ప్రయాణించే మహిళలకు ఏ మాత్రం గౌరవం లభించడం లేదు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనేది ఆచరణలో ఏ మాత్రం కనిపించడం లేదు.
కేవలం రాతలకే పరిమితమవుతోంది. బస్టాండ్‌లో బస్సు వచ్చి ఆగి.. ఆగకముందే తోసుకుంటూ పురుషులు బస్సు ఎక్కేస్తుంటారు.‘ అన్నా..ఏంటీ ఈ తోపులాట.. కాస్త
చూసి నిదానంగా ఎక్కండి,’ అని మహిళలు విన్నవిస్తున్నా వారి మాట ఏ ఒక్కరూ వినడం లేదు.’ బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు. ప్రతి బస్సులో కుడివైపు ఆరు వరుసల సీట్లలో అంటే 18మంది మహిళలు కూర్చోవచ్చు. ఈ సీట్లలో మొత్తం పురుషులే కూర్చుంటున్నారు. మహిళలు వచ్చి లేవండని అడిగినా ఎవరూ వినడం లేదు.
నిస్సహాయులుగా డ్రైవర్లు, కండక్టర్లు
మహిళలు ఎక్కువ సంఖ్యలో నిల్చుని ప్రయాణం చేస్తున్నపుడు, వారికి కేటాయించిన సీట్లలో పురుషులు కన్పిస్తే వారిని లేపి మహిళలను కూర్చోబెట్టేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయత్నిస్తే... పురుషులు వారిపై మాటల యుద్దానికి దిగుతున్నారు. ‘ఏంటీ.. అన్నిచోట్ల రూల్స్ కచ్చితంగా నడుస్తున్నాయా.. సీట్లలో మేం కూర్చోవడమే తప్పా.. అన్ని బస్సులలో కచ్చితంగా రూల్స్ పాటించి ఆడోళ్లను కూర్చోబెడుతున్నారా అనే వాదనకు దిగుతున్నారు. దీంతో చేసేదేమీ లేక కండక్టర్లు, డ్రైవరుల మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు సీట్ల కోసం పురుషులతో వాదనకు దిగుతుంటారు. ఇందులో కొందరు విజయం సాధిస్తే... కొందరు షరా మామూలే అని సర్దుకుపోతుంటారు.
ఇదేనా సంప్రదాయం
Published Sat, Feb 1 2014 2:05 AM | Last Updated on Mon, Aug 20 2018 3:30 PM
Advertisement
Advertisement