ఏలూరు సిటీ: ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఈనెల 21వ తేదీన యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా శిక్షణలో 3 వేల మంది పాల్గొంటారని, ఉదయం 6.30 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఉదయం 7 గంటలకు యోగా మొదలుపెట్టి 7.33 గంటల వరకూ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయూలన్నారు. ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్, బ్రహ్మకుమారి ఆర్గనైజర్ బీకె లావణ్య, బీకే కృష్ణారావు, బీకే రాంబాబు, ఆయుష్ శాఖ డాక్టర్ శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. ఏలూరు బాలయోగి సైన్సు పార్కులో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉద్యోగులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు యోగాలో మెళకువలు నేర్చుకున్నారు.
20న సెయింట్ ఆన్స్‌లో ‘బడి పిలుస్తోంది’
ఏలూరు సెయింట్ ఆన్స్ స్కూల్‌లో ఈ నెల 20న బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంచనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తారన్నారు. టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి సత్కరిస్తారన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఐదేళ్ల పైబడిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్, డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ ఎంఈవో కె.కృష్ణారావు పాల్గొన్నారు.
వేల మందితో యోగా శిక్షణ
Published Thu, Jun 18 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement