
విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు
విశాఖపట్నం : విశాఖజిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న ముగ్గుర్ని ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల మింగేసింది. ఈ ఘటనలో లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు పది మంది స్నేహితులు ఆ తీరంలో ఉన్నారు. అందులో ముగ్గురు స్నానానికి దిగారు. ఒక్కసారిగా వచ్చిన అల ముగ్గురిని సముద్రంలోకి లాక్కెళ్లింది. కళ్లముందే స్నేహితులు గల్లంతవటంతో మిగతా వారు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతయిన వారి కోసం 10 మంది గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.