ఉలిక్కిపడ్డ సిక్కోలు.. అసలు ఏం జరిగింది? | Three Coronavirus Positive Cases In Srikakulam District | Sakshi
Sakshi News home page

కరోనా: ఎవరెవర్ని కలిశారు.. ఏం జరిగింది?

Published Sun, Apr 26 2020 12:04 PM | Last Updated on Sun, Apr 26 2020 1:32 PM

Three Coronavirus Positive Cases In Srikakulam District - Sakshi

పాతపట్నం: సీది గ్రామంలో వైద్య సర్వే చేస్తున్న డీఎంహెచ్‌వో చెంచయ్య, వైద్య సిబ్బంది 

ఆశలు నీరుగారిపోయాయి.. స్క్రీనింగ్‌ పరీక్షల్లో వచ్చిన అనుమానాలు నిజమయ్యాయి. కరోనా బారిన పడకుండా ఇన్నాళ్లూ జిల్లాను కంటికి రెప్పలా చూసుకున్న అధికారుల శ్రమ నిష్ఫలమయ్యింది. ట్రూనాట్‌ కిట్‌ పరీక్షల్లో ‘డిటెక్టెడ్‌ వెరీ లో’ అని వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మరో వ్యక్తికి సంబంధించిన ఫలితం రావాల్సివుంది. పాతపట్నం మండలంలో తొలిసారి కరోనా వెలుగు చూసింది. సేఫ్‌ జోన్‌గా ఉన్న సిక్కోలు కరోనా ప్రభావిత జిల్లాగా మారిపోయింది. ఒకేసారి మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లావాసులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు 18 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి, 96మందిని క్వారంటైన్‌కు పంపారు.  

సాక్షి, శ్రీకాకుళం: కరోనా లక్షణాల్లేకుండానే ఆ మహమ్మారి ఆవహించింది. తొలి అనుమానితునికి నెగిటివ్‌ వచ్చినా.. అతని బంధువులకు పాజిటివ్‌ వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్‌–19 వైరస్‌ అనూహ్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి ట్రూనాట్‌ కిట్‌ పరీక్షల్లో ‘డిటెక్టెడ్‌ వెరీ లో’ అని వచ్చినప్పటికీ కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో నెగి టివ్‌ రావడంతో శుక్రవారం జిల్లా ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. ఆయనకే నెగిటివ్‌ వచ్చినప్పుడు కు టుంబ సభ్యులకు తప్పనిసరిగా నెగిటివ్‌ వస్తుందని అంతా ఊహించారు. కానీ అంచనాలకు భిన్నంగా ఒకే ఇంట్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వీరికెటువంటి లక్షణాల్లేవు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా రు.

కానీ పాజిటివ్‌ రావడం చూసి వైద్య వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారానే వీరికి వైరస్‌ సంక్రమించిందని అధికారులు నిర్ధారణకొచ్చారు. ఆయనకు నెగిటివ్‌ రావడం చూస్తే  వైరస్‌ సోకినా తెలియకుండా ఆయనకు తగ్గిపోయిందని భావిస్తున్నారు. తనకు తెలియకుండానే కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకిందని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిదని అతనికి మరోసారి పరీక్షలు చేశారు. ఫలితం రావలసివుంది. 

పాతపట్నం: రాష్ట్ర సరిహద్దును పరిశీలించిన కలెక్టర్‌ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, డీపీవో రవికుమార్‌  

అనుమానితుడి ప్రయాణ చరిత్ర.. 
పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాడు. మెట్రో రైల్వేలో టెక్నీషియన్‌ గా పనిచేస్తున్నాడు. మార్చి 17వ తేదీన ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ నెంబర్‌ 4లోని 24 నెంబర్‌ బెర్త్‌లో వి జయవాడ వరకు పయనించాడు. 19న అక్కడి నుంచి గుంటూరు–విశాఖపట్నం రైలులో విశాఖ ప్రయాణించాడు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా తలారీ రైల్వే స్టేషన్‌ వరకు గుణుపూర్‌ పాసింజర్‌లో పయనించాడు. తలారీ స్టేషన్‌ నుంచి తన అత్తవారి గ్రామమైన కాగువాడకు బస్సులో బయలుదేరి వెళ్లా డు.

ఈ వ్యక్తి ఢిల్లీలో నివసిస్తున్న జహింగీర్‌పూరి ఏరియాలో 40కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రయాణించిన రైళ్లలో మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నారు. ఆయన ఉన్న కంపార్ట్‌మెంట్‌కు పక్కనున్న కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన వారిలో కొందరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్‌ సంక్రమణ చరిత్ర ఉందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.  

క్వారంటైన్‌లో 96మంది.. 
శుక్రవారం 29మందిని, శనివారం మరో 67మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో తొమ్మిది మందిని ప్రైమరీ కాంటాక్ట్‌గా, 51మందిని సెకండరీ కాంటాక్ట్‌గా గుర్తించారు. మిగతా వారిని సాధారణంగా కలిసిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 23న వీరఘట్టం మండలం మొట్ట వెంకటాపురంలో ఒకాయన చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకని అనుమానితుడు వ చ్చాడు. అక్కడికి పెద్ద సీదికి చెందిన వారు వెళ్లారు. దీంతో అ గ్రామానికి చెందిన ఐదుగుర్ని అనుమానంతో క్వారంటైన్‌కు తరలించారు.  

ఎవరెవర్ని కలిశారు... ఏం జరిగింది? 
ఢిల్లీ యువకుడు తన అత్తవారింటికి కాగువాడకు వచ్చాక భార్య, 10 నెలల కుమారుడు, మామ, అత్త, మరదలిని కలిశాడు. అదే రోజు సాయంత్రం తన స్వగ్రామమైన పెద్ద సీదికి బైక్‌పై వెళ్లాడు. తండ్రిని కలిశాడు. మార్చి 20వ తేదీన తన ఇరుగుపొరుగు వారిని కూడా కలిశాడు. 21న పెద్ద సీది నుంచి బైక్‌పై కాగువాడ వచ్చాడు. జ్వరం, వాంతులు రావడంతో ఒక డాక్టర్‌ని సంప్రదించాడు. ఆ డాక్టర్‌ రాసిన మందులను ఒక మెడికల్‌ షాపులో కొన్నాడు. అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఏప్రిల్‌ 14వ తేదీన తన భార్య అమ్మమ్మను, పిల్లాడ్ని కలిశాడు. 16న కాగువాడ నుంచి తన స్వగ్రామమైన పెద్ద సీదికి బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. 18న మాకివలసలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఆరుగుర్ని కలిశాడు. 20న పెద్ద సీది నుంచి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై అత్తవారి గ్రామమైన కాగువాడకు వచ్చాడు. ఇంతలో తాను పనిచేస్తున్న ఢిల్లీ మెట్రో రైల్వే అధికారుల నుంచి ఒక సమాచారం వచ్చింది. ఢిల్లీ నుంచి వెళ్లిన కారణంగా స్వగ్రామంలో క్వారంటైన్‌లో ఉన్నట్టు... కరోనా లేదని నిర్ధారణ చేసుకునేలా పరీక్షలు చేసి, కలెక్టర్‌ ద్వారా మెడికల్‌ సరి్టఫికేట్‌ తీసుకుని విధుల్లో చేరాలని ఆదేశాలు రావడంతో.. 22న పాతపట్నం సీహెచ్‌సీకి వెళ్లాడు. ఆశా కార్యకర్త, మండల స్పెషలాఫీసర్, కోవిడ్‌ ఆఫీసర్, వలంటీర్‌ సాయంతో వెళ్లిన ఆయన అదే రోజున శాంపిల్స్‌ ఇచ్చి పెద్ద సీదికి వెళ్లిపోయాడు. మొత్తంగా ఈ వ్యక్తి 29మందిని కలిశాడు. వీరందర్నీ ఎచ్చెర్ల క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.

వీరు కొరసవాడ, కాగువాడ, పెద్ద సీధి, మాకివలసకు చెందిన వారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి తన స్నేహితులతో రొంపివలసలో వాలీబాల్‌ ఆడాడు. వారితో కలిసి పెద్దసీదిలో పార్టీ చేసుకున్నాడు. సరుకులు కొనుగోలు చేసేందుకు పాతపట్నం మార్కెట్‌కు వచ్చాడు. పెద్ద సీదిలో ఆయన హాజరైన వివాహ కార్యక్రమానికి విజయనగరం జిల్లాకు చెందిన వారు కూడా హాజరయ్యారని సమాచారం. అలాగే పెద్ద సీదిలో ఒకరు చనిపోతే అక్కడికి పరామర్శకు వెళ్లాడు. ఆ కార్యక్రమానికి మాకివలస గ్రామానికి చెందిన వారు వచ్చారు.  

అధికారులు అప్రమత్తం 
కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన కాగువాడకు 3 కిలోమీటర్ల పరిధిలో గల పాతపట్నంతోపాటు కా గువాడ, సీది, కొరసవాడ, చుట్టుపక్కల 18 గ్రామాలను పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు. కంటైన్మెంట్‌ జోన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు. పాతపట్నంతోపాటు ఇతర గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. 23మంది వైద్యులు, 200మంది ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచారు.  

ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై దృష్టి  
మార్చి 20వ తేదీ తర్వాత ఢిల్లీ నుంచి 211మంది జిల్లాకు వచ్చారు. ట్రైన్‌ చార్ట్, టెలిఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. వారందర్ని హోం ఐసోలేషన్‌లో పెట్టారు. ఢిల్లీ, ముంబాయి తదితర ఇతర ప్రాంతాల 13,500మంది వ్యక్తి వచ్చారు. వారందర్నీ హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వారిపై కూడా తాజా పరిణామంతో దృష్టి సారించారు.  

కరోనాను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం 
ఇక మీదట ఇళ్లల్లోనే ఉండాలి. కరోనా లక్షణాలు ఉంటే స్థానిక ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలకు తక్షణమే తెలియజేయాలి. ప్రస్తుతం తేలిన కేసును పరిశీలిస్తే ఎక్కువమందికి కరోనా వైరస్‌ సోకే అవకాశం లేదని భావిస్తున్నాం. మండల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఇక్కడే ఉంటారు. ఆర్డీవో పర్యవేక్షణ చేస్తారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉండాలి. పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఇంట్లో ఉంటేనే భద్రంగా ఉంటారు. స్వీయ నియంత్రణ పాటించండి. భౌతిక దూరం ఎంతో ముఖ్యం. ఎవరూ అధైర్యపడొద్దు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం.  –జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement