జిల్లాలో గొడిచర్ల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది.
విశాఖ: జిల్లాలో గొడిచర్ల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆగిఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరీశీలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్తికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.