నందిగామ (కృష్ణా జిల్లా) : బల్లకట్టు మీద ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నదిలో జారి పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కృష్ణా జిల్లాకు వెళ్తున్న బల్లకట్టుపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ జారి నదిలో పడ్డారు. దీంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు పోలీసుల సాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారు రామన్నపేటకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.