వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు యువకుల మృతి | Three People Die in Road Accidents in YSR district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు యువకుల మృతి

Published Mon, Aug 26 2013 9:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

Three People Die in Road Accidents in YSR district

కడప : వైఎస్ఆర్ జిల్లాలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి  మండలం గుట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు  ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు  చిత్తూరు జిల్లా కలికిరి మండలం యర్రదొడ్డిపల్లికి చెందిన  సుబ్రమణ్యం , సుందరయ్య , రామాంజులుగా పోలీసులు గుర్తించారు.

వీరంతా రాయచోటిలో బంధువుల ఖర్మకాండకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. రోడ్డు మీద ఆపి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని వీరి బైక్  ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ లైటింగ్‌ ఎక్కువగా ఉండటం వల్లే  ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement