
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండవ రోజు వేంపల్లికి చేరుకున్న వైఎస్ జగన్‌కు గ్రామస్తులతో పాటు ఓ మూడేళ్ల బుడ్డోడు కూడా స్వాగతం పలకడానికి ప్రత్యేకంగా తయారై వచ్చాడు. శ్రీరామనగర్ కాలనీకి చెందిన సురేంద్ర, వరలక్ష్మి మూడేళ్ల కుమారుడు జతీన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను ఒంటినిండా ధరించాడు. బుల్లి సైకిల్‌ని కూడా వైఎస్సార్‌సీపీ జెండాలతో అలంకరించుకున్నాడు. ఎవరి కోసం సైకిల్‌లో ఇలా వచ్చావని అడిగిన వారికి ‘జగన్ మావయ్య కోసం’ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరినీ ఆకర్షించాడు.