నేడు, రేపు సౌర విద్యుత్ ప్రదర్శన | Today and tomorrow, the performance of solar power | Sakshi
Sakshi News home page

నేడు, రేపు సౌర విద్యుత్ ప్రదర్శన

Published Sat, Dec 14 2013 4:48 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

Today and tomorrow, the performance of solar power

సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సౌర విద్యుత్ వ్యవస్థపై ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రదర్శనలో సౌర విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
 
 జిల్లాలోని నెడ్‌క్యాప్‌తోపాటు వివిధ ప్రయివేటు సంస్థల పరికరాలు ఇక్కడి ప్రదర్శనలో ఉంటాయన్నారు. గృహ కేటగిరీలో 3 కేవీ సామర్థ్యం వరకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం రాయితీ ప్రకటించాయన్నారు. దీన్ని గృహ వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement