
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు దోపిడీదారులు ఇతరులపై నిందలు మోపుతూ, మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రివర్గ సమావేశంఆదివారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చ జరగనుంది. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment