
విడిపోయినా కలసి ఉండాలి: రోశయ్య
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోరుునా ప్రజలుగా కలసే ఉండాలని కుల, ప్రజాసంఘాలకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ కొణిజేటి రోశయ్య పిలుపునిచ్చారు. ఆదివారం చంపాపేట శ్రీలక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య తెలంగాణ ప్రజాప్రతినిధులను సన్మానించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్యు వూట్లాడుతూ ఆర్యవైశ్య కులస్తులు రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నందునే మోడీ సర్కార్ తనపై విశ్వాసముంచి కర్ణాటక గవర్నర్ బాధ్యతలను కూడా అప్పగించిందన్నారు