మదనపల్లె, న్యూస్‌లైన్ : మదనపల్లె టమాట జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలుతోంది. జిల్లాలోని మూడు జ్యూస్ ఫ్యాక్టరీలకు రోజూ 25లోడ్ల వరకు కాయలను తరలిస్తున్నారు. మదనపల్లె డివిజన్‌లోని మార్కెట్‌లకు 15 రోజులుగా దిగుబడి అధికంగా రావడంతో ధరలు కుప్పకూలారుు. బుధవారానికి కిలో 90పైసలకు ధర పతనమైంది. వారం రోజులకు ముందు కొంత నిలకడగా ఉన్న ధరలు, ఒక్కసారిగా పతనమయ్యూరుు.
దీంతో దిక్కుతోచని రైతులు చిత్తూరు, పలమనేరు, రేణిగుంట జ్యూస్ ఫ్యాక్టరీలకు జ్యూస్ ఫ్యాక్టరీలకు టమాట కాయలను తరలిస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో కిలో టమాట మొదటి రకం రూ.3.50, రెండవ రకం రూ.2.50, మూడవ రకం రూ.1.70 పైసలు పలకగా, 8వ తేదీన మొదటి రకం రూ.4లు, రెండో రకం రూ.3లు, మూడవ రకం రూ.2లు, 9వ తేదీన మొదటి రకం రూ.3.50, రెండవ రకం రూ.2.50, మూడవ రకం రూ.1.70 పలికింది. ఈ నెల 10,11వ తేదీల్లో కిలో మొదటి రకం రూ.3లు, రెండవ రకం రూ.2లు, మూడవ రకం రూ.1.50లు పలికాయి.
12,13,14,15వ తేదీల్లో మొదటి రకం కిలో రూ.3లు, రెండవ రకం రూ.2లు, మూడవ రకం 90 పైసలకు పడిపోరుుంది. రోజూ మదనపల్లె మార్కెట్‌కు 250 నుంచి 290 టన్నుల వరకు కాయలు వస్తున్నారుు. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, కాకినాడతో పాటు తమిళనాడులోని కుంభకోణం, తిరుచ్చి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు.
జ్యూస్ ఫ్యాక్టరీలకు టమాట
Published Thu, Jan 16 2014 5:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement