కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 19-21 తేదీల్లో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం, 20, 21న ఇంటింటికి తిరిగి 0-5ఏళ్ల లోపు పిల్లలకు చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1998 సంవత్సరం నుంచి జిల్లాలో, 2011 నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదని తెలిపారు. పొరుగు దేశాల్లో ఉన్న పోలియో మన దేశానికి వ్యాపించే ప్రమాదమున్న దృష్ట్యా ప్రభుత్వం పల్స్‌పోలియోను నిర్వహిస్తోందన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల నిండు జీవితానికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత జిల్లాగా మార్చడానికి సహకరించాలని కోరారు. రెండవ విడత పల్స్‌పోలియో ఫిబ్రవరి 23-25 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.
జిల్లాలో 4,26,273 మంది 0-5 సంవత్సరాలు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 2,840 చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతంలో 2,415, పట్టణ ప్రాంతంలో 425 కేంద్రాలతో పాటు 86 మొబైల్ కేంద్రాలు, 44 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 299 ప్రమాద తీవ్రత కేంద్రాలను గుర్తించామన్నారు. 5,312 కుటుంబాలు, 3,361 మంది ఐదేళ్లలోపు పిల్లలు ప్రమాద తీవ్రత ప్రదేశాలలో నివసిస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టిసారించామన్నారు.
జిల్లావ్యాప్తంగా 284 మంది పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ సీనియర్ ప్రోగ్రాం హెల్త్ అధికారులు పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా క్షయ నివారణ అధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, డీటీటీ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా స్కూల్‌హెల్త్ కో ఆర్డినేటర్‌లకు 3-4 క్లస్టర్‌లను, తీవ్రత గల ప్రాంతాలను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ మనోహర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అలీం, డీఎంహెచ్‌వో కె.బాలు పాల్గొన్నారు.
పరిశీలకుడుగా మాణిక్యరావు
పల్స్‌పోలియో జిల్లా పరిశీలకుడిగా డాక్టర్ మాణిక్యరావును ప్రభుత్వం నియమించింది. ఆయన వరంగల్‌లో వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
రేపు పల్స్‌పోలియో
Published Sat, Jan 18 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement