
రేపు సీఎం గుడివాడ రాక
మచిలీపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 17వ తేదీన గుడివాడకు రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన విశాఖపట్నం నుం చి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నాలుగు గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాలకు వస్తారు. 4.15 గంటలకు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు.
సీఎం గన్నవరం రాక
గన్నవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30కి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయ అఫ్రాన్ వద్ద ముఖ్యమంత్రికి జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, తహసీల్దారు ఎం.మాధురి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రకాశం జిల్లా బయలుదేరి వెళ్లారు.