
రేపు విజయవాడ వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడ వెళ్లనున్నారు. గొట్టిముక్కలలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
సోమవారం కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు హత్య చేశారు. దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి నరికి చంపారు. టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.