పోలీసులకు ఫిర్యాదు
క్యాంపస్‌లో మరో వివాదం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూ ప్రాంగణంలో మంగళవారం మరో వివాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్ చిత్రాలున్న ఫ్లెక్సీలను చించివేశారు. దీనిపట్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. మంగళవారం రిపబ్లిక్‌డే నేపధ్యంలో సోమవారం ఎస్వీయూలోని అన్నమయ్య భవన్‌లో బుద్ధవిహార్ సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్, బుద్ధుని ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. మంగళవారం ఉదయం కార్యక్రమా ప్రారంభించే సమయానికి ఫ్లెక్సీలు చించివేసి ఉన్నాయి. ఈసంఘటనపై ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, మాదిగ విద్యార్థి సమాఖ్యలు ఆందోళన వ్యక్తంచేశాయి.
ఈసంఘటనపై విద్యార్థినాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీసీ దామోదరం, తిరుపతి వెస్ట్ డీఎస్పీ అన్నమయ్య భవన్‌ను సందర్శించి చించి వేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు. ఎస్వీయూలో బుధవారం జరగనున్న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈనేపధ్యంలో ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఓ విద్యార్థిసంఘ గోడరాతలను మరో విభాగం తుడిచి వేయించింది.దీనిపట్ల విద్యార్థి నాయకులు సోమవారం రాత్రి ఆందోళన చేశారు. రెండు సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ దామోదరం స్వయంగా వెళ్లి విద్యార్థులకు నచ్చచెప్పారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ ఫొటోలున్న ఫ్లెక్సీలు చించి వుండడం విశేషం. ఈ పని ఆకతాయిలదా లేక రాత్రి గొడవ పడ్డ విద్యార్థి సంఘ నాయకులు చించివేశారా అనేది మిస్టరీగా మారింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎస్వీయూలో అంబేద్కర్ ఫ్లెక్సీల చించివేత
Published Wed, Jan 27 2016 3:59 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
Advertisement