ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి
తాడిపత్రి: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని బలైంది. తాడిపత్రి మండల పరిషత్తు కార్యాలయం వద్ద శుక్రవారం విద్యుదాఘాతానికి గురై గౌస్‌బీ(14) అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చనిపోరుుంది. వివరాలిలా ఉన్నారుు. పట్టణంలోని పీర్లమాన్యంలో నివాసముం టున్న హమాలీ కుళ్లాయప్ప రెండో కుమార్తె గౌస్‌బీ. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సమీప బంధువు గృహాప్రవేశానికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటిపైకి వెళ్లగా.. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగిలారుు.
షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహానికి తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా..ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని రోడ్డుపై ధర్నా చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత విద్యుత్ అధికారులదేనని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పట్టించుకోని అధికారులు..
విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయంపై చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని, ఇలా ఎంత మంది చనిపోవాలో వారే చెప్పాలని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఇళ్లపై నుంచే పట్టణంలోని ప్రధాన సబ్‌స్టేషన్‌కు 11 కేవీ లైన్ అనుసంధానించబడింది. ఈ తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉన్నారుు. ఈ విషయూన్ని స్థానికులు చాలా సార్లు విద్యుత్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోలేదు. ఏడాది క్రితం కూడా రేకులకు విద్యుత్ సరఫరా అరుు్య ఓ వ్యక్తి మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం ఇదే కాలనీకి చెందిన బాబావలి(11) విద్యుత్ షాక్‌కు గురై ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయూడు.