=తాగు నీటి సమస్య నివారణకు చర్యలు
=మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరాలి
=ఐటీడీఏ పీవో వినయ్ చంద్
పెదబయలు/పాడేరు రూరల్, న్యూస్‌లైన్: పెదబయలు మండలం మారుమూల పెదకోడాపల్లి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని అండ్రవర, పులిగొంది ఆదివాసీ గ్రామాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.విన య్ చంద్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఐటీడీఏ ఉన్నతాధికారి తొలిసారి రావడంతో ఆ గ్రామాల గిరిజనులు ఉబ్బితబ్బిబయ్యా రు. ఇంత కాలం తమ గ్రామానికి ఉన్నతాధికారులు రాక సమస్యలు పరిష్కారం కాక నానా అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కలిగిందని ఆనందించారు.
ఈ సందర్భంగా పీవో ఆయా గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పథకాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెదకోడాపల్లి నుంచి అండ్రవర, పులిగొంది గ్రామాలకు రోడ్డు, సామాజిక భవనాలు నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో వాటి నిర్మాణాలకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పీవో చెప్పా రు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులకు దూరంగా ఉండాలని, మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో చేరి పొదుపు పాటించాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేస్తామన్నా రు. గ్రామంలో ఉన్న బాల బడిని తనిఖీ చేశారు. చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. పులిగొంది గ్రామంలోని చెక్‌డ్యామ్ మరమ్మతులకు పీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ ఎం.ఆర్.జి.నాయు డు, డీఈ డి.వి.ఆర్.ఎం.రాజు, ఐకేపీ ఏపీ డీ రత్నాకర్, ఏసీ భాస్కర్ పాల్గొన్నారు.
ఆదివాసీ గ్రామాల్లో శాశ్వత పథకాలు
Published Tue, Dec 24 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement