V. Vinay Chand
-
ఆదివాసీ గ్రామాల్లో శాశ్వత పథకాలు
=తాగు నీటి సమస్య నివారణకు చర్యలు =మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరాలి =ఐటీడీఏ పీవో వినయ్ చంద్ పెదబయలు/పాడేరు రూరల్, న్యూస్‌లైన్: పెదబయలు మండలం మారుమూల పెదకోడాపల్లి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని అండ్రవర, పులిగొంది ఆదివాసీ గ్రామాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.విన య్ చంద్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఐటీడీఏ ఉన్నతాధికారి తొలిసారి రావడంతో ఆ గ్రామాల గిరిజనులు ఉబ్బితబ్బిబయ్యా రు. ఇంత కాలం తమ గ్రామానికి ఉన్నతాధికారులు రాక సమస్యలు పరిష్కారం కాక నానా అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కలిగిందని ఆనందించారు. ఈ సందర్భంగా పీవో ఆయా గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పథకాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెదకోడాపల్లి నుంచి అండ్రవర, పులిగొంది గ్రామాలకు రోడ్డు, సామాజిక భవనాలు నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో వాటి నిర్మాణాలకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పీవో చెప్పా రు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులకు దూరంగా ఉండాలని, మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో చేరి పొదుపు పాటించాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేస్తామన్నా రు. గ్రామంలో ఉన్న బాల బడిని తనిఖీ చేశారు. చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. పులిగొంది గ్రామంలోని చెక్‌డ్యామ్ మరమ్మతులకు పీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ ఎం.ఆర్.జి.నాయు డు, డీఈ డి.వి.ఆర్.ఎం.రాజు, ఐకేపీ ఏపీ డీ రత్నాకర్, ఏసీ భాస్కర్ పాల్గొన్నారు. -
Mills, farmers in trouble
పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని కాఫీ రైతులందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే ప్రోత్సాహక సొమ్ము చెల్లించాలని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవడం, మండల కేంద్రాల్లో కొత్త బ్యాంకుల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, కాఫీ రైతులు, ఉపాధి కూలీలకు చెల్లింపులు, బ్యాంకు లింకేజి రుణాలపై పీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్న ప్రోత్సాహక నగదు సక్రమంగా అందకపోవడంతో బ్యాంకు ఖాతాల ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో 7786 మంది కాఫీ రైతుల్లో 4704 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. మిగిలిన 3082 మంది యుద్ధప్రాతిపదికన ఖాతాలను తెరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ మండలంలోను 3 నుంచి 4వరకు బ్యాంకులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎం బి.జయబాబును పీవో ఆదేశించారు. చింతపల్లి, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో బ్యాంకుల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తామన్నారు. భౌగోళికంగా 60 శాతం విస్తీర్ణంలో గిరిజన ప్రాంతాలు ఉన్నాయని, జనాభా ప్రతిపాదికన చూసుకుంటే బ్యాంకులు అదనంగా అవసరమన్నారు. ఉపాధి కూలీలకు గ్రామైఖ్య సంఘాల ఖాతాల్లో జమ అవుతాయని, అయితే కూలీలకు చెల్లింపులు జరపకుండా బ్యాంకు అధికారులు వీవోల ఖాతాల నుంచి బకాయిలను రీకవరి చేయడం నేరమన్నారు. గొలుగొండ, ఐఎల్పురం, శరభన్నపాలెం, కేడీ పేటల్లో బ్యాంకుల ద్వారా జీడి తోటల రైతులకు కూడా ఖాతాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఏజెన్సీలోని 9500 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి కూడా ఐటీడీఏ చర్యలు తీసుకుంటుందని పీవో తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమే
=కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమే =గిరిజనుల వద్దకు అన్ని పథకాలు =సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం =న్యూస్‌లైన్‌తో ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో గిరిజనులకు మేలు చేకూర్చడానికి ఉద్దేశించిన కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అన్యాయానికి గురైన అడవిబిడ్డలకు మేలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఐటీడీఏ పీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ చెప్పారు. ఏజెన్సీలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసి సమగ్రాభివృద్ధి సాధించాలన్నది తన లక్ష్యమని చెప్పారు. గిరిజనులకు అందుతున్న సేవల్లో లోపాలపై విస్తృత పరిశీలన జరిపానని, సమస్యల పరిష్కారంపై ఇక దృష్టి సారిస్తానని బుధవారం న్యూస్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రశ్న: ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టు అక్రమాలపై మీ స్పందన ఏమిటి? జవాబు: ఏజెన్సీలో 2009 నుంచి ఇంతవరకు నిర్వహించిన కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగి నట్టు నిర్ధారణకు వచ్చా ను. అయితే పెండింగ్ చెల్లింపులు కూడా అధికంగా ఉన్నాయి. ఏ స్థాయిల్లో అక్రమాలు జరిగాయో విచారణ చేపడుతున్నాం. ప్రశ్న: బాధిత రైతులకు ఏం చేస్తారు? జవాబు: కాఫీ ప్రాజెక్టు ద్వారా కాఫీ సాగు చేపట్టిన రైతులందరికి న్యాయం చేస్తాం. వారికి చెల్లించాల్సిన ప్రోత్సాహక సొమ్మం తా అందిస్తాం. ప్రశ్న: కాఫీ సాగు అభివృద్ధి మాటేమిటి? జవాబు: అవినీతిని తుడిచిపెట్టి కాఫీ సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. ఏజెన్సీలో కాఫీ సాగును మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీ, సిల్వర్‌ఓక్ నర్సరీల ఏర్పాటు ద్వారా గిరిజన రైతులకు అన్ని విధాలా సహాయ పడతాం. ప్రోత్సాహక చెల్లింపులన్నీ సక్రమంగా జరుపుతాం. ప్రశ్న : మౌలిక సౌకర్యాల కొరతను ఎలా అధిగమిస్తారు? జవాబు : గిరిజన ప్రాంతాలను మౌలిక సదుపాయాల కొర త తీవ్రంగా వేధిస్తోంది. ఇందుకు నిధుల సమస్య కూడా ప్రతి బంధకంగా ఉంది. ఐఏపీ, టీఎస్పీ నిధులు పాడేరు ఐ టీడీఏకు భారీగా రానున్నాయి. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు తయారు చేస్తున్నాం. అందుకు తగ్గట్టు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. ప్రశ్న : రహదారుల సమస్యపై చర్యలేమిటి? జవాబు : ఏజెన్సీలో రహదారుల అభివృద్ధికి దండిగా నిధులు మంజూరు అవుతున్నాయి. రహదారుల నాణ్యతపై దృష్టి పెడతాం. ప్రస్తుతం ఏజెన్సీలో 255 ముఖ్యమైన రోడ్డు పనులకు పీఎంజీఎస్‌వై ద్వారా భారీగా నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డు పనులు సత్వరం పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తాం. ప్రశ్న : మన్యంలో విద్యాభివృద్ధికి చర్యలేమిటి? జవాబు : డ్రాపౌట్లు లేకుండా గ్రామాల్లో పిల్లలందరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రస్తుతం సర్వే చేపడుతున్నాం. ప్రశ్న : వైద్య సౌకర్యాల పరిస్థితి దయనీయంగా ఉంది.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? జవాబు : ఏజెన్సీలోని 3,559 గ్రామాల్లో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తాం. రెండేళ్లుగా మలేరియా తగ్గుముఖం పట్టడం సంతోషదాయకం. ఇదే స్ఫూర్తి తో ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు లభించేలా శ్రమిస్తాం. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృ తం చేస్తాం. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తాం. తొందరలోనే 22 అంబులెన్స్‌లు కూడా ఏజెన్సీకి రానున్నాయి. -
నంబర్ వన్‌గా విశాఖ మన్యం
=అటవీ హక్కుల కల్పనలో అగ్రస్థానం =రాష్ట్రంలోనే ముందంజలో ఉండాలి =రెవెన్యూ, అటవీ శాఖలదే బాధ్యత =ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పాడేరు, న్యూస్‌లైన్: అటవీహక్కుల చట్టం అమలులో విశాఖ ఏజెన్సీ రాష్ట్రం లోనే మొదటిస్థానంలో ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ ఆకాంక్షించారు. ఏజెన్సీలోఅటవీ హక్కు ల చట్టం అమలులో భాగంగా రెండు విడతల భూ పట్టాల పంపిణీ, భూము ల సర్వేపై గురువారం తన కార్యాల యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతుల సాగులో ఉన్న భూములకు పట్టాలు పంపిణీ చేసి గిరిజనులకు సామాజిక హోదా కల్పిం చాలని కోరారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి అటవీ భూములపై సర్వే నిర్వహించి రికార్డులను వెంటనే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేయడం వలన అభ్యంతరాలు ఉత్పన్నం కావని చెప్పారు. సర్వే చేసిన భూముల వివరాలను జిల్లా స్థాయీ సంఘానికి పంపించి అనుమతులు పొందాలని కోరారు. ఇప్పటివరకు 7500 క్లెయిములకుగాను 7068 క్లెయిములకు సంబంధించి సర్వే పూర్తి చేశారని చెప్పారు. అటవీహక్కుల భూముల సర్వేపై ప్రతి వారం ప్రగతి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి నివేదికలు కచ్చితంగా ఉండాలని కోరారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు తెలియజేయవద్దని చెప్పారు. రహదారుల నిర్మాణంతోనే గిరిజనాభివృద్ధి ఆధారపడి ఉందని చెప్పారు. కించూరు రోడ్డు నిర్మాణానికి గల అభ్యంతరాల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కించూరు రోడ్డు పూర్తయితే పాడేరు, పెదబయలు మండలాల్లోని 50 గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో డివిజనల్ అటవీశాఖ అధికారి ఎస్.శాంతారామ్, పాడేరు ఆర్డీవో ఎం.గణపతిరావు, ఐటీడీఏ ఎపీవో పీవీఎస్నాయుడు, 11 మండలాల తహశీల్దారులు, అటవీశాఖ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.