పార్వతీపురం: విజయనగరం జిల్లాలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా బుధవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పార్వతీపురం మండలకేంద్రంలోని ఆర్టీసీ జంక్షన్ వద్ద నిర్వహించిన ధర్నాకు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని మావోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మావోయిస్టులు గిరిజనులపై దుశ్చర్యలకు దిగడం మానుకోవాలన్నారు. సాలూరులో మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనులను చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మావోల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మంగళవారం జాకరవలసకు చెందిన కూతూడి వెంకట్రావు అనే వ్యక్తిని మావోలు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
మావోలకు వ్యతిరేకంగా గిరిజనుల ధర్నా
Published Wed, Mar 23 2016 5:55 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement