పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ 10వ వర్థంతి సందర్భంగా కుటుంబసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులతో పాటు ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పలువురు నాయకులు నివాళులర్పించారు. కాగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమర్తి వైఎస్ జయమ్మ జీవించి ఉన్నంతకాలం ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకున్నారు.