ట్రిపుల్ ధమాకా.. | triple dhamaka | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ధమాకా..

Published Tue, Sep 24 2013 3:06 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

triple dhamaka


 కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ :
 దసరా అడ్వాన్స్.. దీపావళి బోనస్.. లాభాల వాటా.. ఈ ఏడాది అన్నీ ఒకేసారి మరో రెండు నెలల్లో కార్మికులకు అందనున్నా యి. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎవరికి ఎంత వస్తుందో అని ఇప్ప టి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
 
 2012- 13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ఇప్పటికే కార్మికులకు అందాల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ విషయ మై కార్మిక సంఘాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తో చర్చలు మాత్రం జరిపారు. గత ఏడాది లాభాల వాటా 17 శాతం చెల్లించగా ఈ ఏడాది 18 శాతం ఇస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమై న హామీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 25 శాతం వాటా చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో పది రోజుల్లో లాభాల వాటా ప్రకటన వెలువడే అవకాశం ఉందని, అక్టోబర్ మొదటివారంలో చెల్లింపులుంటాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఏడాది సంస్థ లాభాలు *401.8కోట్లుగా తెలుస్తోంది. 18 శాతం కార్మికులకు వాటాగా ఇస్తే ఒక్కో కార్మికుడికి సరాసరి *11వేల వరకు రావచ్చు. 20 శాతం వాటా ఇస్తే *12వేల వరకు అందనున్నా యి. ఇందులో భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టు గనుల్లో ప్రత్యక్షంగా ఉత్పత్తిలో పాల్గొనేవారికి అధిక మొత్తంలో, సర్ఫేస్‌తో పాటు కార్యాల యాల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు కొంత తక్కువ మొత్తంలో లాభాలు అందనున్నాయి.
 
 దసరా అడ్వాన్స్ *10వేలు
 దసరా అడ్వాన్స్ ఇంతకు ముందు *8వేలు ఇచ్చిన సంస్థ గత ఏడాది నుంచి *10వేలు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కోల్‌ఇండియా యాజమాన్యం నిర్ణయం మేరకు గత ఏడాది దీపావళి బోనస్‌గా కార్మికులకు *26,500 అందించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దీపావళి బోనస్‌పై కోల్‌ఇండియా నుంచి స్పష్టమైన హామీ రాలేదు. అయితే *30వేలకు పైగానే బోనస్ వచ్చే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. దీంతో మరో రెండు నెలల్లో కార్మికులకు దసరా అడ్వా న్స్, లాభాల వాటా, దీపావళి బోనస్ కలిపి *50వేలకు పైనే చేతికి అందే అవకాశం ఉంది. మస్టర్లు, అటెండెన్స్ ఆధారంగానే లాభాల వాటా చెల్లించనున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement