deepavali bonus
-
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనస్ అందించనుంది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ. 76,500 బోనస్ అందనుంది. ఈ మొత్తం ఈనెల 21న వారి ఖాతాల్లో జమ కానుంది. ఇదిలా ఉండగా సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా, దీపావళి బోనస్‌లకు చెల్లింపునకు సింగరేణి రూ. 379 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ. 25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున లక్షా 15 వేల వరకూ రానున్నాయి. చదవండి: మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు -
బోనస్ బొనాంజా..!
శ్రీరాంపూర్/గోదావరిఖని, న్యూస్‌లైన్ : చాలా రోజులుగా కార్మికులు ఎదురుచూస్తున్న రెండు రకాల బోనస్‌లు ఒకే సారి అందివచ్చాయి. దీపావళి బోనస్(పీఎల్ఆర్), సింగరేణి లాభాల వాటా(బోనస్)ను కోల్ఇం డియా యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం గురువారం ప్రకటించాయి. లాభాల వాటా కోసం నెలరోజులుగా కంపెనీ వ్యాప్తంగా కార్మిక సం ఘాలు చేపట్టిన ఆందోళనల ఫలితంగా ప్రకట న వెలువడడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈసారి బోనస్ ఎక్కువగా వస్తుం దనుకున్నప్పటికీ గత ఏడాది కంటే ఒక శాత మే పెరగడంతో కార్మికు లు పెదవి విరుస్తున్నారు. గురువారం ఐఎన్టీయూసీ జాతీ య అధ్యక్షుడు ఎన్.సంజీవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావులు ముఖ్యమంత్రిని కలి సారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కార్మికులు ఎంతో కష్టపడి 53.2 మిలియన్ టన్నుల బొగ్గుఉత్పత్తి చేసి కంపెనీకి *401 కోట్ల లాభా లు సాధించి పెట్టారని, వారికి అందులో 25 శాతం వాటా ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య చర్చ జరిగిన అనంతరం సీఎం గత ఏడాది చెల్లించిన 17 శాతం వాటాకు ఒక శాతం కలిపి ఇస్తామని ప్రకటిం చారని భేటీ అనంతరం వెంకట్రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. *401 కోట్ల లాభాల నుంచి 18 శాతం వాటాగా *72.05 కోట్లు కార్మికులకు చెందనున్నాయి. ఇవి ఏరోజు ఇస్తారనేది యాజమాన్యం ప్రకటిస్తుంది. దసరాకు ముం దే ఇప్పిస్తామని ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ నేతలు వేరువేరుగా తెలిపారు. కొలిక్కి వచ్చిన కోల్‌కతా చర్చలు ఇదే రోజు జాతీయ కార్మిక సంఘాలు, కోల్ఇండియా యాజమాన్యం మధ్య కోల్‌కతాలో జరిగిన చర్చలు ఫలించాయి. ఇందులో ప్రాఫి ట్ లింక్డ్ రివార్డు(పీఎల్ఆర్) బోనస్‌పై చర్చిం చి *31500 ఇవ్వడానికి నిర్ణయించారు. మొద టి నుంచి *50వేలు చెల్లించాలని జాతీయ సంఘాలు డిమాండ్ చేయగా గత ఏడాది *26,500 చెల్లించిన బోనస్ *5 వేలు పెంచు తూ నిర్ణయించారు. దీనితోపాటు కాంట్రాక్ట్ కార్మికులకు 8.3 శాతం బోనస్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని వెంకట్రావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామ య్య, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సీఐటీయూ నేత జీవన్‌రాయ్ వేరువేరుగా తెలిపారు. ఇదిలా ఉండగా సింగరేణి యాజమాన్యం దసరా పండుగ సందర్భంగా ప్రతీ కార్మికుడికి *10వేలు అడ్వాన్స్ రూపంలో అక్టోబర్ 8వ తేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అటు వాటా, ఇటు బోనస్, అడ్వాన్స్ ఒకే సారి అందిరావడంతో కార్మికు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కార్మికుల విజయం సింగరేణి కార్మికులు చేసిన కష్టానికి ప్రతిఫలం గా లాభాలలో సముచితమైన వాటా చెల్లించాలని కొన్ని రోజులుగా వివిధ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆయా కార్మిక సంఘాల నాయకులు సీఎం వద్దకు వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. ఎట్టకేలకు సీఎం స్పందించి కంపెనీ లాభాల్లో 18 శాతం వాటా ప్రకటించడంతో కార్మిక సంఘాలు తమ భవిష్యత్ ఆదోళన కార్యక్రమాలను రద్దు చేసుకున్నాయి. ఇది కార్మికుల విజయమని గుర్తిం పు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్కొన్నారు. -
ట్రిపుల్ ధమాకా..
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : దసరా అడ్వాన్స్.. దీపావళి బోనస్.. లాభాల వాటా.. ఈ ఏడాది అన్నీ ఒకేసారి మరో రెండు నెలల్లో కార్మికులకు అందనున్నా యి. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎవరికి ఎంత వస్తుందో అని ఇప్ప టి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. 2012- 13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ఇప్పటికే కార్మికులకు అందాల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ విషయ మై కార్మిక సంఘాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తో చర్చలు మాత్రం జరిపారు. గత ఏడాది లాభాల వాటా 17 శాతం చెల్లించగా ఈ ఏడాది 18 శాతం ఇస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమై న హామీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 25 శాతం వాటా చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో పది రోజుల్లో లాభాల వాటా ప్రకటన వెలువడే అవకాశం ఉందని, అక్టోబర్ మొదటివారంలో చెల్లింపులుంటాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఏడాది సంస్థ లాభాలు *401.8కోట్లుగా తెలుస్తోంది. 18 శాతం కార్మికులకు వాటాగా ఇస్తే ఒక్కో కార్మికుడికి సరాసరి *11వేల వరకు రావచ్చు. 20 శాతం వాటా ఇస్తే *12వేల వరకు అందనున్నా యి. ఇందులో భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టు గనుల్లో ప్రత్యక్షంగా ఉత్పత్తిలో పాల్గొనేవారికి అధిక మొత్తంలో, సర్ఫేస్తో పాటు కార్యాల యాల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు కొంత తక్కువ మొత్తంలో లాభాలు అందనున్నాయి. దసరా అడ్వాన్స్ *10వేలు దసరా అడ్వాన్స్ ఇంతకు ముందు *8వేలు ఇచ్చిన సంస్థ గత ఏడాది నుంచి *10వేలు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కోల్ఇండియా యాజమాన్యం నిర్ణయం మేరకు గత ఏడాది దీపావళి బోనస్‌గా కార్మికులకు *26,500 అందించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దీపావళి బోనస్‌పై కోల్ఇండియా నుంచి స్పష్టమైన హామీ రాలేదు. అయితే *30వేలకు పైగానే బోనస్ వచ్చే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. దీంతో మరో రెండు నెలల్లో కార్మికులకు దసరా అడ్వా న్స్, లాభాల వాటా, దీపావళి బోనస్ కలిపి *50వేలకు పైనే చేతికి అందే అవకాశం ఉంది. మస్టర్లు, అటెండెన్స్ ఆధారంగానే లాభాల వాటా చెల్లించనున్నారు.