శ్రీరాంపూర్/గోదావరిఖని, న్యూస్‌లైన్ :
చాలా రోజులుగా కార్మికులు ఎదురుచూస్తున్న రెండు రకాల బోనస్‌లు ఒకే సారి అందివచ్చాయి. దీపావళి బోనస్(పీఎల్‌ఆర్), సింగరేణి లాభాల వాటా(బోనస్)ను కోల్‌ఇం డియా యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం గురువారం ప్రకటించాయి. లాభాల వాటా కోసం నెలరోజులుగా కంపెనీ వ్యాప్తంగా కార్మిక సం ఘాలు చేపట్టిన ఆందోళనల ఫలితంగా ప్రకట న వెలువడడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈసారి బోనస్ ఎక్కువగా వస్తుం దనుకున్నప్పటికీ గత ఏడాది కంటే ఒక శాత మే పెరగడంతో కార్మికు లు పెదవి విరుస్తున్నారు. గురువారం ఐఎన్‌టీయూసీ జాతీ య అధ్యక్షుడు ఎన్.సంజీవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావులు ముఖ్యమంత్రిని కలి సారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కార్మికులు ఎంతో కష్టపడి 53.2 మిలియన్ టన్నుల బొగ్గుఉత్పత్తి చేసి కంపెనీకి *401 కోట్ల లాభా లు సాధించి పెట్టారని, వారికి అందులో 25 శాతం వాటా ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య చర్చ జరిగిన అనంతరం సీఎం గత ఏడాది చెల్లించిన 17 శాతం వాటాకు ఒక శాతం కలిపి ఇస్తామని ప్రకటిం చారని భేటీ అనంతరం వెంకట్రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. *401 కోట్ల లాభాల నుంచి 18 శాతం వాటాగా *72.05 కోట్లు కార్మికులకు చెందనున్నాయి. ఇవి ఏరోజు ఇస్తారనేది యాజమాన్యం ప్రకటిస్తుంది. దసరాకు ముం దే ఇప్పిస్తామని ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్ నేతలు వేరువేరుగా తెలిపారు.
కొలిక్కి వచ్చిన కోల్‌కతా చర్చలు
ఇదే రోజు జాతీయ కార్మిక సంఘాలు, కోల్‌ఇండియా యాజమాన్యం మధ్య కోల్‌కతాలో జరిగిన చర్చలు ఫలించాయి. ఇందులో ప్రాఫి ట్ లింక్డ్ రివార్డు(పీఎల్‌ఆర్) బోనస్‌పై చర్చిం చి *31500 ఇవ్వడానికి నిర్ణయించారు. మొద టి నుంచి *50వేలు చెల్లించాలని జాతీయ సంఘాలు డిమాండ్ చేయగా గత ఏడాది *26,500 చెల్లించిన బోనస్ *5 వేలు పెంచు తూ నిర్ణయించారు. దీనితోపాటు కాంట్రాక్ట్ కార్మికులకు 8.3 శాతం బోనస్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని వెంకట్రావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామ య్య, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సీఐటీయూ నేత జీవన్‌రాయ్ వేరువేరుగా తెలిపారు. ఇదిలా ఉండగా సింగరేణి యాజమాన్యం దసరా పండుగ సందర్భంగా ప్రతీ కార్మికుడికి *10వేలు అడ్వాన్స్ రూపంలో అక్టోబర్ 8వ తేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అటు వాటా, ఇటు బోనస్, అడ్వాన్స్ ఒకే సారి అందిరావడంతో కార్మికు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కార్మికుల విజయం
సింగరేణి కార్మికులు చేసిన కష్టానికి ప్రతిఫలం గా లాభాలలో సముచితమైన వాటా చెల్లించాలని కొన్ని రోజులుగా వివిధ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆయా కార్మిక సంఘాల నాయకులు సీఎం వద్దకు వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. ఎట్టకేలకు సీఎం స్పందించి కంపెనీ లాభాల్లో 18 శాతం వాటా ప్రకటించడంతో కార్మిక సంఘాలు తమ భవిష్యత్ ఆదోళన కార్యక్రమాలను రద్దు చేసుకున్నాయి. ఇది కార్మికుల విజయమని గుర్తిం పు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్కొన్నారు.
బోనస్ బొనాంజా..!
Published Fri, Oct 4 2013 2:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement