టీటీడీ ఆస్తులను కాపాడండి | TTD protect assets | Sakshi
Sakshi News home page

టీటీడీ ఆస్తులను కాపాడండి

Published Thu, Aug 28 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

టీటీడీ ఆస్తులను కాపాడండి

టీటీడీ ఆస్తులను కాపాడండి

  •      భక్తులు కానుకలుగా సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతం
  •      భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి
  •      టీటీడీ, ప్రభుత్వం ఏం చేస్తున్నాయి?
  •      ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చింతల
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే టీటీడీ, ప్రభుత్వం ఏం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. భక్తితో ఇచ్చిన ఆస్తులను కబ్జాదారులు సొంతం చేసుకుంటే భక్తు ల మనోభావాలు దెబ్బతినవా అని ప్ర శ్నించారు. అన్యాక్రాంతమైన ఆస్తులను తక్షణమే స్వాధీనం చేసుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని సూచించారు.

    బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కుబడుల రూపంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు భారీ ఎత్తు న కానుకలు సమర్పిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా తిరుమలకు వస్తోన్న భక్తులు తమ ఆస్తులను కూడా కానుకగా శ్రీవారికి ఇస్తున్నారని చెప్పారు. ఇలా ఇచ్చి న వాటిల్లో చెన్నై, కలకత్తా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విలువైన భూ ములు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయన్నారు.

    మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి కి కానుకగా సమర్పించిన ఆస్తుల్లో అనేకం అన్యాక్రాంతమయ్యాయన్నారు. భక్తులు భక్తితో సమర్పిం చిన ఆస్తులను టీటీడీ అధికారులు పరిరక్షించలేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ అంటే మినీ గవర్నమెంటు వంటి సంస్థ అని.. ఆ సంస్థలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి, సుమారు 16వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.

    ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న టీటీడీ భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశా రు. అన్యాక్రాంతమైన టీటీడీ ఆస్తుల వివరాలను నిగ్గుతేల్చేందుకు సభా సంఘాన్ని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే అన్యాక్రాం తమైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్‌లను తక్కువ అద్దెకు సొంతం చేసుకున్న బడా వ్యాపారులు.. అద్దెను పెంచకుండా టీటీ డీ ఆదాయానికి గండికొడుతున్నారన్నారు.

    ఆ బడా వ్యాపారులకు టీటీడీ ఉన్నతాధికారులు కొందరు వంతపాడుతున్నారన్నారు. తక్షణమే లీజులను రద్దు చేసి.. టెండర్ల ద్వారా షాపింగ్ కాంప్లెక్స్‌లను లీజుకు ఇచ్చి టీటీడీకీ అదనపు ఆదాయాన్ని రాబట్టి ఆ ధనా న్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని సూచించా రు. వీరికి దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరా వు సమాధానం ఇస్తూ.. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవమేనని అంగీకరించారు.

    టీటీడీకి భూములు, షాపింగ్ కాంప్లెక్స్‌ల రూపంలో రూ.9,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. ఆ ఆస్తులను పరిరక్షించడంతోపాటు అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. తక్కువ అద్దె ఇస్తోన్న షాపింగ్ కాంప్లెక్స్‌ల లీజులను రద్దు చేసి.. టెండర్లు నిర్వహించి కొత్తగా లీజుకు ఇస్తామని స్పష్టీకరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement