
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రత్యేక అధికారి పోస్టును ఇక నుంచి.. అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మార్చుతూ ప్రభుత్వం ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై 30 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్టు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.