టీటీడీ నిబంధనలతో భక్తుల ఆవేదన
- 24 గంటలు దాటితే లడ్డూలు ఇవ్వరట
సాక్షి,తిరుమల: టీటీడీ కఠిన నిబంధనలు శ్రీవారి భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. లడ్డూ టోకెన్లు కేటాయించిన స మయానికి 24 గంటలు దాటితే లడ్డూలు ఇవ్వడం లేదు. దీనిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాం ప్లెక్స్‌లో వేచి ఉడే సమయంలోనే భక్తులందరికీ లడ్డూలు ఇచ్చే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. దీంతో కాలి బాట క్యూలతోపాటు సర్వదర్శన క్యూ ల్లోనూ రూ.20కి రెండు లడ్డూలు, రూ. 50కి మరో రెండు లడ్డూ టోకెన్లు అందుతున్నాయి. దీంతో భక్తులు సులువుగా ల డ్డూలు పొందే వసతి కలిగింది.
లడ్డూ నిబంధనలపై భక్తుల అభ్యంతరం
24 గంటల్లోపు టోకెన్లు తీసుకొస్తేనే ల డ్డూలిస్తామన్న టీటీడీ నిబంధనపై భ క్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లపై ముద్రించిన నిబంధనలు తె లియకపోవడం, మరి కొందరు నిరక్షరాస్యులు కావడంతో ఇబ్బంది పడుతున్నా రు. నడకదారుల్లో నడిచివచ్చి శ్రీవారి దర్శనం తర్వాత సేద తీరుతుంటారు. గదులు ఖాళీ చేసి వెళ్లే సమయంలో ల డ్డూలు పొందవచ్చననే అభిప్రాయంతో కౌంటర్ల వద్దకు ఆలస్యంగా చేరుకుం టారు. అలాంటి వారికి లడ్డూలు దక్క డం లేదు. గురువారం గుంటూరుకు చెం దిన సుధాకర్‌కు కౌంటర్ వద్ద ఇలాంటి అనుభవమే ఎదురైంది. 12 లడ్డూల కో సం టికెట్లు పొంది 30 గంటల తర్వాత వెళితే కౌంటర్ సిబ్బంది లడ్డూలు ఇచ్చేం దుకు నిరాకరించారు. నగదు చెల్లించి తీసుకొచ్చిన టోకెన్లకు లడ్డూలెందుకు ఇ వ్వరు? అని భక్తుడు కౌంటర్ సిబ్బందిని ప్రశ్నించారు. ‘డబ్బులు హుం డీలో వేశామని వెళ్లిపోండి’ అని సమాధానం ఇవ్వడంతో ఆ భక్తుడు ఆవేదన చెందారు. దీంతో బ్లాక్‌లో అధిక ధరలకు లడ్డూలు పొంది, తిరుగుప్రయాణమయ్యారు.
దళారులను ఆశ్రయిస్తున్న భక్తులు
టీటీడీ కఠిన నిబంధనలతో భక్తులకు స్వామి ప్రసాదమైన లడ్డూలను నిబంధనల పేరుతో దూరం చేస్తోంది. దీనివల్ల లడ్డూల కోసం బాధిత భక్తులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. భక్తుల అవసరాలను దళారులు సొమ్ము చేసు కుంటున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన కఠిన నిబంధనలపై టీటీడీ పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.