Srivari devotees
-
తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్
సాక్షి, తిరుపతి: శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, వికలాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగే ఏడుకొండలు కరోనా ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2020 మార్చి 20 తేదీన శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అటు తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 8,9వ తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శన భాగ్యం కల్పించిన తరువాత 10వ తేదీ స్థానికులతో శ్రీవారి దర్శనం ట్రయిల్ రన్‌ను టీటీడీ నిర్వహించింది. అటు తరువాత జూన్ 11వ తేదీ నుంచి 6 వేల మంది భక్తులతో శ్రీవారి దర్శనాలు ప్రారంభించింది. క్రమేపి భక్తుల సంఖ్యను 75 వేల మంది భక్తులకు పైగా దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ.. ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, నిత్య సేవలైన అర్చన, తోమాల, అభిషేక సేవలను ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చింది. దర్శనాలు పునః ప్రారంభమైన ప్రత్యక్షంగా ఆర్జిత, నిత్య సేవలలో పాల్గొనే అవకాశం మాత్రం భక్తులకు దక్కలేదు. భక్తుల కోరిక మేరకు కల్యాణోత్సవ సేవను వర్చువల్ గా టీటీడీ ప్రారంభించింది. వర్చువల్ సేవకు భక్తుల వద్ద నుంచి విశేష స్పందన రావడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను వర్చువల్‌గా ప్రారంభించింది. శ్రీవారికి వారానికి ఒక్కసారి నిర్వహించే విశేష పూజ, అష్టదళము,సహస్ర కలిశాభిషేకం,తిరుప్పావడ, నిత్యం నిర్వహించే వసంతోత్సవ సేవను ప్రారంభించలేదు. గతేడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి సేవలను ప్రారంభిస్తామని టీటీడీ ప్రకటించినా కేసులు భారీగా పెరుగుతుండటంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మరల ఈ ఏడాది అర్జిత, నిత్య సేవలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. కోవిడ్ ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య పెంపుపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో గత రెండు ఏళ్లుగా వికలాంగులు, వయో వృద్దులకు జారీ చేసే దర్శన విధానంలో నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత వికలాంగులు, వయో వృద్దులకు స్వామి వారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ముందు వరకూ తిరుమలలోని మ్యూజియం వద్ద ఉన్న కౌంటర్లో ఉదయం 10 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు 750 టోకెన్లను వయో వృద్దులకు,వికలాంగులకు కేటాయించేది టీటీడీ.. అయితే కోవిడ్ కారణంగా ఈ టోకెన్ల జారీని నిలిపి వేసింది. కోవిడ్ పూర్తి స్ధాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యను పెంచింది. అయితే ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వికలాంగులకు, వయోవృద్దులకు దర్శనం కల్పించాలంటూ భక్తులు టీటీడీ అధికారులను విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా టీటీడీ అధికారులకు పెద్ద ఎత్తున లేఖలు కూడా రావడంతో దీనిపై సానుకూలంగా స్పందించింది టీటీడీ.. ఈక్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి వయో వృద్దులకు, వికలాంగులకు కల్పించే దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. రోజుకి 1000 టిక్కెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. అయితే శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పది గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్దులకు, వికలాంగులు దర్శన భాగ్యం కల్పచేందుకు టీటీడీ చర్యలు చేపడుతుంది.. అయితే వీరికి అందజేసే టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమలలో జారీ చేస్తారా..లేక తిరుపతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారా.. లేక ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తారా అన్న విషయం మాత్రం తెలియాల్సింది.. ఏది ఏమైనప్పటికీ వికలాంగులు, వయోవృద్దుల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
TTD: ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల
తిరుమల/తిరుపతి తుడా/చంద్రగిరి: తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి రద్దు చేశామని చైర్మన్ వివరించారు. ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదనే భావనలో టీటీడీ ఉందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ప్రస్తుతం ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీవేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి స్లాట్ సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. విశేష పర్వదినాల్లో వర్చువల్ సేవ శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్ సేవగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సీఎం చేతులమీదుగా శ్రీనివాససేతు ప్రారంభం తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు ఫ్లైఓవర్ తొలిదశ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. -
సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా?
తిరుమల: శ్రీవారి భక్తులను గంగరగోళానికి గురిచేసి, టీటీడీకి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామి వారి నిత్యాన్నదానాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల టీటీడీ ఒక పెద్ద క్యాంటీన్లో భక్తులకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా ఇది విజయవంతమైతే ఈ భోజనం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే (కాస్ట్ టు కాస్ట్) భక్తుల నుంచి స్వీకరించనుంది. అయితే ఈ విషయాన్ని కొందరు గందరగోళపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనించి టీటీడీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. బయట ఆహారాన్ని తీసుకోవాలనే శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని అందించాలనే లక్ష్యంతోనే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తులు, దాతలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. చదవండి: చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు -
తిరుమలలో గో ఆధారిత సంప్రదాయ భోజనం
తిరుమల: శ్రీవారి భక్తులకు ఉచిత భోజన సదుపాయంతోపాటు సంప్రదాయ భోజనాన్ని కూడా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో షడ్రుచులతో కూడిన భోజన వసతి కల్పించనుంది. ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఇకపై భక్తులకు కూడా ఈ సంప్రదాయ భోజనాన్ని కాస్ట్ టు కాస్ట్ (ఎంత ఖర్చు అయితే అంత) సేల్ విధానంలో అందించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవన్లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్నమయ్య భవన్లో కొందరికి సంప్రదాయ భోజనం గో ఆధారిత భోజనం ఇలా ► అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి.. మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. ► దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు. ► కాలాబాత్ బియ్యంతో ఉప్మా, కులంకార్ బియ్యంతో ఇడ్లీలు తయారు చేశారు. వీటిలో వ్యాధినిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ► సెప్టెంబర్ 8వ తేదీ వరకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. -
'శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు'
తిరుమల: తిరుమల తిరుపతి నుంచి షిర్డీకి మధ్య నూతన రైలు వస్తోంది. శనివారం రైల్వేమంత్రి సురేష్ ప్రభు తిరుపతి-షిర్డీ కొత్త రైలు ప్రారంభోత్సవం చేశారు. జెండా ఊపి నూతన రైలును ఆయన ప్రారంభించారు. రైలు ప్రారంభోత్సవం అనంతరం సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. తిరుపతి స్టేషన్‌ను మరింత అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అంతేకాక శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. -
టీటీడీ నిబంధనలతో భక్తుల ఆవేదన
- 24 గంటలు దాటితే లడ్డూలు ఇవ్వరట సాక్షి,తిరుమల: టీటీడీ కఠిన నిబంధనలు శ్రీవారి భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. లడ్డూ టోకెన్లు కేటాయించిన స మయానికి 24 గంటలు దాటితే లడ్డూలు ఇవ్వడం లేదు. దీనిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాం ప్లెక్స్‌లో వేచి ఉడే సమయంలోనే భక్తులందరికీ లడ్డూలు ఇచ్చే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. దీంతో కాలి బాట క్యూలతోపాటు సర్వదర్శన క్యూ ల్లోనూ రూ.20కి రెండు లడ్డూలు, రూ. 50కి మరో రెండు లడ్డూ టోకెన్లు అందుతున్నాయి. దీంతో భక్తులు సులువుగా ల డ్డూలు పొందే వసతి కలిగింది. లడ్డూ నిబంధనలపై భక్తుల అభ్యంతరం 24 గంటల్లోపు టోకెన్లు తీసుకొస్తేనే ల డ్డూలిస్తామన్న టీటీడీ నిబంధనపై భ క్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లపై ముద్రించిన నిబంధనలు తె లియకపోవడం, మరి కొందరు నిరక్షరాస్యులు కావడంతో ఇబ్బంది పడుతున్నా రు. నడకదారుల్లో నడిచివచ్చి శ్రీవారి దర్శనం తర్వాత సేద తీరుతుంటారు. గదులు ఖాళీ చేసి వెళ్లే సమయంలో ల డ్డూలు పొందవచ్చననే అభిప్రాయంతో కౌంటర్ల వద్దకు ఆలస్యంగా చేరుకుం టారు. అలాంటి వారికి లడ్డూలు దక్క డం లేదు. గురువారం గుంటూరుకు చెం దిన సుధాకర్‌కు కౌంటర్ వద్ద ఇలాంటి అనుభవమే ఎదురైంది. 12 లడ్డూల కో సం టికెట్లు పొంది 30 గంటల తర్వాత వెళితే కౌంటర్ సిబ్బంది లడ్డూలు ఇచ్చేం దుకు నిరాకరించారు. నగదు చెల్లించి తీసుకొచ్చిన టోకెన్లకు లడ్డూలెందుకు ఇ వ్వరు? అని భక్తుడు కౌంటర్ సిబ్బందిని ప్రశ్నించారు. ‘డబ్బులు హుం డీలో వేశామని వెళ్లిపోండి’ అని సమాధానం ఇవ్వడంతో ఆ భక్తుడు ఆవేదన చెందారు. దీంతో బ్లాక్‌లో అధిక ధరలకు లడ్డూలు పొంది, తిరుగుప్రయాణమయ్యారు. దళారులను ఆశ్రయిస్తున్న భక్తులు టీటీడీ కఠిన నిబంధనలతో భక్తులకు స్వామి ప్రసాదమైన లడ్డూలను నిబంధనల పేరుతో దూరం చేస్తోంది. దీనివల్ల లడ్డూల కోసం బాధిత భక్తులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. భక్తుల అవసరాలను దళారులు సొమ్ము చేసు కుంటున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన కఠిన నిబంధనలపై టీటీడీ పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన: గిరిధర్ గోపాల్
టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ పోస్టాఫీసుల ద్వారా దర్శన టికెట్ల బుకింగ్ వృద్ధులకు స్వామి కనిపించేలా బైనాక్యులర్ సదుపాయం సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులు తిరుమలలోని క్యూలు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా తగిన సమయం ప్రకారం వచ్చి స్వామిని దర్శించుకునేలా టైం స్లాట్ విధానం అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు, అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత రూ.300 టికెట్ల దర్శనంలో కొత్త విధానం అమలు చేస్తామని, తర్వాత దశలో కాలినడక, సర్వదర్శనం, ఇతర దర్శనాలకు అమలు చేస్తామని చెప్పారు. టైం స్లాట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, ఇంటర్నెట్, ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే విధానంపై యోచన చేస్తున్నామని ఈవో వెల్లడించారు. పోస్టాఫీసుల సేవలను వినియోగించుకుంటే దర్శన టికెట్ల కోసం టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్ల అవసరం ఉండదని చెప్పారు. మహాలఘుదర్శనంలో సుమారు 70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకోవాల్సి ఉండటంతో వృద్ధులకు బైనాక్యులర్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని వివరించారు. -
శ్రీవారి భక్తులకు సమైక్య సెగ
సాక్షి, తిరుమల/తిరుపతి : సీమాంధ్ర బంద్ ప్రభావంతో మంగళవారం తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైకి వెళ్లేవాళ్లు, తిరుమల నుంచి తిరిగి వచ్చేవారు రవాణా సదుపాయాలు లేక అష్టకష్టాలు పడ్డారు. ఉదయం నుంచే తిరుమల, తిరుపతి మధ్య తిరిగే 107 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. టీటీడీ, ప్రైవేట్ వాహనాలతోపాటు ద్విచక్రవాహనాలనూ సమైక్యవాదులు అనుమతించలేదు. దీంతో వేలాదిమంది భక్తులు తిరుపతిలోనే ఉండిపోయారు. రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుపతిలో ఉండే ఉద్యోగులను, ఆలయ సిబ్బందిని తెల్లవారుజామునే అలిపిరి టోల్గేట్ తర్వాత ఘాట్‌రోడ్డు మీదుగా టీటీడీ లారీలు, ఇతర వాహనాల ద్వారా తిరుమలకు చేర్చారు. ఆ సమయానికి రాని కొంతమంది రవాణా సౌకర్యంలేక వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని బస్సులు, రాత్రి 7 గంటల తర్వాత మొత్తం బస్సుల రాకపోకలు కొనసాగాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో లఘుదర్శనం కల్పించారు. సాయంత్రం వరకు శ్రీవారి ఆలయ ప్రాం గణం కొంత బోసిపోయినట్టు కనిపించింది. తిరుమలకు రాలేని భక్తులకు అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం, రైల్వే స్టేషన్ల వద్ద టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు అందజేశారు. టీటీడీ కాంప్లెక్స్‌లలో ఆశ్రయం కల్పించినట్లు ఈవో ఎంజీ గోపాల్ విలేకరులకు తెలిపారు. బస్టాండ్‌లో తోపులాట సాయంత్రం 4 గంటల నుంచి బస్సులు, ప్రయివేట్ వాహనాల కోసం భక్తులు ఎగబడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద భక్తుల మధ్య తీవ్రమైన తోపులాటలు జరిగాయి. కొందరిని బస్టాండు కంపార్ట్మెంట్లో పెట్టి గేట్లు మూసేశారు. బయట ఉన్న భక్తులను రోడ్లపైనే కూర్చోబెట్టి టికెట్ల మంజూరు చేశారు. చంటి బిడ్డలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. -
తిరుపతి, చిత్తూరులో ఎక్కడి వక్కడే
సాక్షి, తిరుపతి: తిరుపతిని సమైక్యవాదులు దిగ్బంధించారు. ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు తిరక్కుండా గట్టి చర్యలు తీసుకున్నారు. వాహనాలు లేకపోవడంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలిపిరి బస్టాండ్ శ్రీవారి భక్తులతో కిటకిటలాడింది. బస్సుల కోసం బారులు తీరారు. ఎండలో రోడ్డుపై గంటలు గంటలు వేచి ఉండటం కనిపించింది. ఎండకు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. తాగునీటికి, ఆహారానికి ఇబ్బందులు పడ్డారు. క్యూ విడిచి వెళితే మళ్లీ చివర్లోకి వెళ్లాల్సి వస్తుందని భావించి గంటలపాటు లైన్లోనే నిల్చుండిపోయారు. తిరుపతికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు, చిరు వ్యాపారులకు సైతం తిప్పలు తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు నిరసనగా బుధ, గురువారాల్లో తిరుపతి, చిత్తూరులో రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ మేరకు మొత్తం 49 సంఘాల వారు ఒక్కటై బృందాలుగా విడిపోయి నగరాల్లో విస్తృతంగా పర్యటిస్తూ బంద్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేశారు. తిరుపతి, చిత్తూరు శివారు ప్రాంతంలో తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్లివచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు నగరాల్లో ఏ ఒక్క షాపునూ తెరవనివ్వలేదు. ఆస్పత్రులు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు తాళాలు వేశారు. తిరుపతి కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎల్.వర్మ ఆధ్వర్యంలో కుర్చీలను వెనక్కు తిప్పి తలపై పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సెంట్రల్ పార్క్ వద్ద మానవహారంగా ఏర్పడి ‘విభజనకు తెగబడితే.. కుర్చీలు తిరగబడతాయ్. కుర్చీలు పట్టుకు వేలాడకుండా ఉద్యమంలోకి రండి’ అంటూ పిలుపునిచ్చారు.