
'శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు'
తిరుమల: తిరుమల తిరుపతి నుంచి షిర్డీకి మధ్య నూతన రైలు వస్తోంది. శనివారం రైల్వేమంత్రి సురేష్ ప్రభు తిరుపతి-షిర్డీ కొత్త రైలు ప్రారంభోత్సవం చేశారు. జెండా ఊపి నూతన రైలును ఆయన ప్రారంభించారు.
రైలు ప్రారంభోత్సవం అనంతరం సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. తిరుపతి స్టేషన్‌ను మరింత అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అంతేకాక శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు.