విజయనగరం : విజయనగరం జిల్లా బొందపల్లె మండలం గొట్లాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై ఇద్దరు విజయనగరం వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తేజ, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు.