ఏజెన్సీలో రెండు మందుపాతర్లు స్వాధీనం | two landmines seized in agency | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో రెండు మందుపాతర్లు స్వాధీనం

Published Mon, Dec 7 2015 8:30 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

two landmines  seized in agency

ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు రెండు మందుపాతర్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ అటవీ ప్రాంతంలో కొయ్యూరు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భూమిలో పాతిపెట్టిన రెండు మందుపాతర్లను పసిగట్టి తొలగించారు. ఈ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసి తమపై దాడి చేయడానికే మావోయిస్టులు వీటిని అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement