PLGA
-
అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినా.. మౌనం వీడని మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్కౌంటర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా.. ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. రోడ్డు పనులు అడ్డుకోండి.. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న తుల్తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలుఅయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది. -
మహిళా మావోయిస్టులో అసభ్యకర ప్రవర్తన.. పీఎల్జీఏ సభ్యుడి హతం
చర్ల: మహిళా మావోయిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఎల్జీఏ సభ్యుడిని మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పీఎల్జీఏ 17వ బెటాలియన్‌కు చెందిన మను దుగ్గ పార్టీలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టులపై అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై మహిళా మావోయిస్టులు అగ్ర నాయకులకు ఫిర్యాదు చేయగా.. వారు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంకేర్ జిల్లాలోని దండకారణ్య ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు ఆయనను హతమార్చారు. ఈ మేరకు లేఖను కూడా మృతదేహం వద్ద వదిలారు. కాగా, మావోయిస్టులు హతమార్చిన పార్టీ పీఎల్జీఏ సభ్యుడు మను దుగ్గపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ -
ఘనంగా గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు
ఆంధ్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పీఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈవారోత్సవాల్లో మావోయిస్టులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను మావోయిస్టులు రిలీజ్ చేశారు. -
‘మావో’ళ్లు 4739 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు, ఆపరేషన్ కమాండ్ గ్రూప్ పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై ఈ డిసెంబర్‌కు 20 ఏళ్లు. ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒకప్పటి కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి నేతృత్వంలో 2000లో ఏర్పాటు చేసిన పీఎల్జీఏను పీజీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) అని కూడా మావోయిస్టు పార్టీ పిలుస్తోంది. సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పీఎల్జీఏ ఏర్పా టై ఇరవై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ సావనీర్ విడుదల చేసింది. ఈ ఇరవై ఏళ్లలో పీఎల్జీఏ చేసిన ఆపరేషన్స్, మావోయిస్టులు, పోలీసులు ఎంతమంది చనిపోయారన్న పూర్తి వివరాలను అందులో పేర్కొంది. పీఎల్జీఏ రెండు దశాబ్దాల్లో సాగించిన ఆపరేషన్స్‌లో కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర కార్యదర్శులు, సభ్యు లు, డివిజన్ కమిటీ కార్యదర్శులు, మెంబర్లు, ఏరియా కమిటీ సభ్యులు, దళసభ్యులు మొత్తం 4,739 మందిని కోల్పోయినట్లు సావనీర్లో తెలిపింది. ఇందులో 909 మంది మహిళామావోయిస్టులుండగా, 16 మంది కేంద్రకమిటీ సభ్యులు, 44 మంది స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్ర కమిటీ సభ్యులు, 9 మంది రీజినల్ కమిటీ సభ్యులు, 168 మంది జోన్/డివిజన్/జిల్లా కమిటీ సభ్యులు మృతిచెందగా, మిగిలినవారిలో ఏరియా సభ్యులు, గ్రామదళ సభ్యులున్నట్టు పేర్కొంది. పీఎల్జీఏ ఆపరేషన్స్‌లో 3,054 పోలీసుల మృతి పీఎల్జీఏ 2000 నుంచి 2021 జూలై వరకు జరిపిన మిలటరీ ఆపరేషన్స్‌లో 3,054 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, అధికారులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మరో 3,672 మంది పోలీస్ బలగాల సిబ్బంది క్షతగ్రాతులైనట్టు, 3,222 ఆయుధాలు, 1,55,356 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 4,572 ఆపరేషన్స్ నిర్వహించగా, వాటిల్లో భారీవి 210 కాగా, మధ్యస్థ 331, మైనర్ ఆపరేషన్స్ 4,031 ఉన్నట్టు వెల్లడించింది. సీఆర్పీఎఫ్ ఉపయోగించిన రక్షణ శాఖ హెలికాప్టర్లపై కూడా దాడులు నిర్వహించినట్టు తెలిపింది. 2008, 2010, 2011, 2012, 2013లో హెలికాప్టర్లపై తూటాల వర్షం కురిపించగా, కమాండర్ స్థాయి అధికారితోపాటు ముగ్గురు సిబ్బంది మరణించినట్టు పేర్కొంది. 2021 ఏప్రిల్ 19న సుక్మా–బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ డ్రోన్ సహాయంతో బాంబుదాడులు చేసిందని, ప్రతిదాడి చేసి దానిని కూల్చివేసినట్టు తెలిపింది. ఇలా పలు డ్రోన్ దాడులను కూడా నిర్వీర్యం చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సింగిల్ యాక్షన్‌లో నేతల హతం సింగిల్ యాక్షన్‌లో భాగంగా 2007లో జార్ఖండ్ టాటానగర్ ఎంపీ సునీల్ మçహతోను, అతడి ముగ్గురు బాడీగార్డులు, ఇతరులను ఒకేసారి పీఎల్జీఏ హతమార్చినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు 13 మంది బాడీగార్డులను 2013 మే 25న నిర్మూలించినట్టు పార్టీ పేర్కొంది. ఏపీలో 2018, సెప్టెంబర్ 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను హతమర్చినట్టు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 2019 ఏప్రిల్ 9 దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండావితోపాటు అతడి నలుగురు బాడీగార్డులను బుల్లెట్ వాహనంతో సహా పేల్చివేసినట్టు తెలిపింది. -
మావోయిస్టు పోస్టర్ల కలకలం
భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలంలో మావోయిస్టులు పోస్టర్లు అంటించడం కలకలం సృష్టిస్తోంది. ఆలుబా హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో గోడలపై మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. పీఎల్జీఏ 16వ వారోత్సవాలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని పోస్టర్లలో ఉంది. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారోత్సవానలు జరపాలని చర్ల, శబరి ఏరియాల మావోయిస్టులు పేర్కొన్నారు. -
ఏజెన్సీలో రెండు మందుపాతర్లు స్వాధీనం
ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు రెండు మందుపాతర్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ అటవీ ప్రాంతంలో కొయ్యూరు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భూమిలో పాతిపెట్టిన రెండు మందుపాతర్లను పసిగట్టి తొలగించారు. ఈ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసి తమపై దాడి చేయడానికే మావోయిస్టులు వీటిని అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. -
దండకారణ్యంలో కందకాలు
దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్థాయిలో కందకాల తవ్వకం చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసే బేస్ క్యాంపులను అడ్డుకోవడంలో భాగంగానే వ్యూహాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతంలో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టులు తమ స్ధావరాలను సేఫ్ జోన్ లుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు కాకుండా.. ఇప్పటికే ఏర్పాటు చేసిన క్యాంపులకు సరఫరాలు అందకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు డిసెంబర్ నెలలో ఏటా జరిగే పీఎల్ జీఏ వారోత్సవాల నిర్వహణలో భాగంగానే.. ముందు జాగ్రత్త చర్యగా కందకాల ఏర్పాటు జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని అమ్మపేట - పాలచల్మ మధ్యలో శుక్రవారం రాత్రి నుంచి మావోయిస్టులు రోడ్డుమార్గంలో కందకాల తవ్వకాలు మొదలుపెట్టారు. దండకారణ్య నేత సుధాకర్ నేతృత్వంలో వందలాది మంది మిలీషియా సభ్యులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రహదారిపై దాదాపు పది నుంచి పదిహేను కందకాలు తవ్వినట్లు తెలుస్తోంది. రెండునెలల క్రితం పైడిగూడెం అటవీ ప్రాంతంలోని రహదారిపై మావోయిస్టులు 20 కిపైగా కందకాలు తవ్వారు. ఆ తర్వాత మావోయిస్టు విలీన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల కోసమే కందకాలు తవ్వారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఏజెన్సీలో రెడ్ అలర్ట్
ములుగు : భారతదేశ విప్లవోద్యమాన్ని పురోగమింపజేసేందుకు సీపీఐ(మావోయిస్టు పార్టీ) ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్జీఏ) నేటితో 15వ వసంతంలో కి అడుగుపెట్టింది. కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో అమరులైన పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ నాయకులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌ల అమరత్వం రగిలించిన స్ఫూర్తితో డిసెంబర్ 2, 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ ఎర్రసైన్యం డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారోత్సవాలకు సిద్ధమైంది. దేశంలో విప్లవోద్యమ ప్రయోగశాలగా పే రొందిన వరంగల్ జిల్లాలో దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతుండగా.. కాల్పుల విరమణ సమయంలో మొదటి తూటా పేలిం ది వరంగల్‌లోనే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మా వోరుుస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో వందల సంఖ్యలో మావోయిస్టు నేతలు, సభ్యులు నేలకొరిగారు. ఫలితంగా జిల్లాలో వందల్లో ఉన్న సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే స్థితికి పడిపోయింది. కొంతకాలం స్థబ్దుగా ఉన్న ములుగు, ఏటూరునాగారం ఏజెన్సీలో మూడేళ్ల క్రితం కేకేడబ్ల్యూ కార్యదర్శి మర్రి రవి అలియూస్ సుధాకర్ ఆధ్యర్వంలో పార్టీ పున ర్నిర్మాణానికి కొంత కృషి జరిగినప్పటికీ.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం పువ్వర్తిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతోపాటు కేకేడ బ్ల్యూ కమిటీలో ఇద్దరు, ముగ్గురు మినహా దాదాపు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఏటూరునాగారం ఏజెన్సీ లో మావోయిస్టుల అలికిడి తగ్గింది. అరుుతే పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పార్టీ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మావోరుుస్టుల చర్యలను భగ్నం చేసేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కంతనపల్లి, ముల్లకట్ట, తుపాకులగూడెం, మంగపేట మండలం కత్తిగూడ, వెంకటాపూర్ మం డలం అడవిరంగాపూరం, నర్సింగాపురం, ములుగు మండలం కన్నాయిగూడెం, అంకన్నగూడెం, సర్వాపూర్, తాడ్వాయి మండలం కా ల్వపల్లి, కాటారాం, బయ్యక్కపేటలాంటి నక్స ల్స్ ప్రభావిత గ్రామాలపై పోలీసుల ఓ కన్నేసి ఉంచారు. వారోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాలపై నజర్.. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తమ ఉనికి ని చాటుకునేందుకు ఖమ్మం జిల్లాతోపాటు చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని గోదావరి నది దాటి ఏజెన్సీలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో పోలీసులు గోదావరి రేవు ప్రాంతాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నజర్ వేశారు. ఇప్పటికే లక్ష్మీపురం, కంతనపల్లి, తుపాకులగూడెం, రాంనగర్, మంగపేట ఫెర్రీ పారుుంట్ల వద్ద పడవ ప్రయాణాన్ని పోలీసులు నిలిపివేసినట్లు సమాచారం. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే కొందరు నక్సల్స్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం ఉండడంతో ఇన్ఫార్మర్లను పోలీసులు అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మాజీలకు కౌన్సెలింగ్.. గతంలో నక్సల్స్ గ్రూపుల్లో పని చేసి లొంగిపోయిన మాజీలకు ఏజెన్సీలోని పోలీసులు కౌన్సెలింగ్ నిర్విహ స్తున్నారు. ఎలాంటి ఘటనలు జరిగినా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని వారిని హెచ్చరించినట్లు తెలిసింది. గ్రామాల్లో చిన్న ఘటన జరిగినా తమకు తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. బిక్కుబిక్కుమంటున్న నాయకులు.. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో స్థానిక నాయకులు, ఇన్ఫార్మర్లుగా ముద్రపడిన వ్యక్తు లు బిక్కుబిక్కుమంటున్నారు. వారిలో ఇప్పటికే చాలా మంది జిల్లా కేంద్రానికి వెళ్లారు.