ఏజెన్సీలో రెడ్ అలర్ట్ | Agency on red alert | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో రెడ్ అలర్ట్

Published Tue, Dec 2 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

ఏజెన్సీలో రెడ్ అలర్ట్

ఏజెన్సీలో రెడ్ అలర్ట్

ములుగు : భారతదేశ విప్లవోద్యమాన్ని పురోగమింపజేసేందుకు సీపీఐ(మావోయిస్టు పార్టీ) ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) నేటితో  15వ వసంతంలో కి అడుగుపెట్టింది. కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో అమరులైన పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ నాయకులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌ల అమరత్వం రగిలించిన స్ఫూర్తితో డిసెంబర్ 2, 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ ఎర్రసైన్యం డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారోత్సవాలకు సిద్ధమైంది. దేశంలో విప్లవోద్యమ ప్రయోగశాలగా పే రొందిన వరంగల్ జిల్లాలో దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది.

2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతుండగా.. కాల్పుల విరమణ సమయంలో మొదటి తూటా పేలిం ది వరంగల్‌లోనే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మా వోరుుస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో వందల సంఖ్యలో మావోయిస్టు నేతలు, సభ్యులు నేలకొరిగారు. ఫలితంగా జిల్లాలో వందల్లో ఉన్న సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే స్థితికి పడిపోయింది.

కొంతకాలం స్థబ్దుగా ఉన్న ములుగు, ఏటూరునాగారం ఏజెన్సీలో మూడేళ్ల క్రితం కేకేడబ్ల్యూ కార్యదర్శి మర్రి రవి అలియూస్ సుధాకర్ ఆధ్యర్వంలో పార్టీ పున ర్నిర్మాణానికి కొంత కృషి జరిగినప్పటికీ.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం పువ్వర్తిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయనతోపాటు కేకేడ బ్ల్యూ కమిటీలో ఇద్దరు, ముగ్గురు మినహా దాదాపు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఏటూరునాగారం ఏజెన్సీ లో మావోయిస్టుల అలికిడి తగ్గింది. అరుుతే పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పార్టీ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో మావోరుుస్టుల చర్యలను భగ్నం చేసేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కంతనపల్లి, ముల్లకట్ట, తుపాకులగూడెం, మంగపేట మండలం కత్తిగూడ, వెంకటాపూర్ మం డలం అడవిరంగాపూరం, నర్సింగాపురం, ములుగు మండలం కన్నాయిగూడెం, అంకన్నగూడెం, సర్వాపూర్, తాడ్వాయి మండలం కా ల్వపల్లి, కాటారాం, బయ్యక్కపేటలాంటి నక్స ల్స్ ప్రభావిత గ్రామాలపై పోలీసుల ఓ కన్నేసి ఉంచారు. వారోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
సరిహద్దు ప్రాంతాలపై నజర్..
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో తమ ఉనికి ని చాటుకునేందుకు ఖమ్మం జిల్లాతోపాటు చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని గోదావరి నది దాటి ఏజెన్సీలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో పోలీసులు గోదావరి రేవు ప్రాంతాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నజర్ వేశారు. ఇప్పటికే లక్ష్మీపురం, కంతనపల్లి, తుపాకులగూడెం, రాంనగర్, మంగపేట ఫెర్రీ పారుుంట్ల వద్ద పడవ ప్రయాణాన్ని పోలీసులు నిలిపివేసినట్లు సమాచారం. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే కొందరు నక్సల్స్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం ఉండడంతో ఇన్‌ఫార్మర్లను పోలీసులు అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
 
మాజీలకు కౌన్సెలింగ్..
గతంలో నక్సల్స్ గ్రూపుల్లో పని చేసి లొంగిపోయిన మాజీలకు ఏజెన్సీలోని పోలీసులు కౌన్సెలింగ్ నిర్విహ స్తున్నారు. ఎలాంటి ఘటనలు జరిగినా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని వారిని హెచ్చరించినట్లు తెలిసింది. గ్రామాల్లో చిన్న ఘటన  జరిగినా తమకు తెలియజేయాలని సూచించినట్లు సమాచారం.
 
బిక్కుబిక్కుమంటున్న నాయకులు..
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో స్థానిక నాయకులు, ఇన్‌ఫార్మర్లుగా ముద్రపడిన వ్యక్తు లు బిక్కుబిక్కుమంటున్నారు. వారిలో ఇప్పటికే చాలా మంది జిల్లా కేంద్రానికి వెళ్లారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement