హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14 న రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు స్థానాలకు గురువారం షెడ్యూలు ప్రకటించగా, ఆందులో మూడు స్థానాలకు ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉంది. మరొకటి కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికకు సంబంధించినది. పాలడుగు పదవీ కాలం 29 మార్చి 2017 వరకు (మరో రెండేళ్లు) ఉండగా, ఆయన ఈ ఏడాది జనవరి 19న మరణించిన విషయం విదితమే.
మండలి ఎన్నికలకు రెండు నోటిఫికేషన్లు
Published Sat, May 9 2015 3:31 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement