'చంద్రబాబు తీరుతో ఇరు ప్రాంతాలు నష్టపోతున్నాయి'
హైదరాబాద్: ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు ఆరోపించారు. చంద్రబాబు వ్యవహార తీరుతో రెండు రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడటానికి ముందు మీ పార్టీ నేతలతో మాట్లాడాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. పక్క రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు కోరుకుంటోందని ఆయన అన్నారు. ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని హరీష్‌రావు తెలిపారు.
సచివాలయంలో కంచె ఏర్పాటు చేసింది తాము కాదని.. చంద్రబాబు విమర్శలకు హరీష్ రావు సమాధానమిచ్చారు. కంచె ఏర్పాటుపై గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకున్నారని హరీష్‌రావు వివరణ ఇచ్చారు.