ఆలయాలను వదలట్లేదు.. | two temples thefted in krishna district | Sakshi
Sakshi News home page

ఆలయాలను వదలట్లేదు..

Published Sun, Oct 18 2015 12:58 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM

two temples thefted in krishna district

నాగాయలంక : దోపిడి దొంగలు ఇళ్లు, షాపులే కాదు...చివరకు ఆలయాలను వదలట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రెండు ఆలయాల్లో జరిగిన దొంగతనాలతో స్థానికంగా కలకలం రేపింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోకి దొంగలు చోరబడి అమ్మవారి మంగళసూత్రం, స్వామివారి నామాలు ఎత్తుకుపోయారు.

అలాగే, తూర్పుబజార్‌లోని కోదండరామాలయంలోనూ వారు చోరీకి  పాల్పడ్డారు. ఆదివారం ఉదయం దేవాలయంలో చోరీ జరిగినట్టు గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్లోఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement