two temples
-
రెండు ఆలయాల్లో చోరీ
త్రిపురారం: నల్లగొండ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. త్రిపురారం మండలంలోని రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు బాబుసాయిపేట గ్రామంలోని కనకదుర్గ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయాల్లోని రెండు హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ. 1.25 లక్షలతో ఉడాయించారు. ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయాలను వదలట్లేదు..
నాగాయలంక : దోపిడి దొంగలు ఇళ్లు, షాపులే కాదు...చివరకు ఆలయాలను వదలట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రెండు ఆలయాల్లో జరిగిన దొంగతనాలతో స్థానికంగా కలకలం రేపింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోకి దొంగలు చోరబడి అమ్మవారి మంగళసూత్రం, స్వామివారి నామాలు ఎత్తుకుపోయారు. అలాగే, తూర్పుబజార్లోని కోదండరామాలయంలోనూ వారు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం దేవాలయంలో చోరీ జరిగినట్టు గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్లోఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇళ్లేకాదు ఆలయాలనూ వదల్లేదు!
శ్రీకాకుళం: ఇళ్లలో చోరీలు చేసింది చాలక ఏకంగా దేవాలయాలకూ కన్నం వేశారు దోపిడీ దొంగలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లతోపాటు మంజునాథ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో విలువైన ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. -
ఆ దేవుళ్లకు ఉల్లిపాయలే కానుకలు
జైపూర్ : నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, పప్పులు ధరలు రోజురోజుకు రాకెట్ స్పీడ్తో ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. అయినా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన ఆ ధరలను మాత్రం నియంత్రించలేకపోతుంది. కానీ వాటి ధర ఎంత పెరిగినా లెక్కచేయకుండా కొంగు బంగారంగా కొలిచే ఆ దేవుళ్లకు మాత్రం భక్తులు తమ భక్తి ప్రపత్తులతో ఉల్లిపాయలు, పప్పులు చెల్లించుకుంటున్నారు. ఈ ఆచారం రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లా గోమేధి గ్రామంలో కొలువు తీరిన గొగాజీ, గురు గోరఖ్నాథ్ దేవాలయాల్లో ఆచారంగా కొనసాగుతుంది. అదీ ఒక్క భాద్రపథమాసంలోనే భక్తులు ఇలా దేవుళ్లకి సమర్పిస్తారని ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ మాసంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ నుంచి దాదాపు 40 లక్షల మంది భక్తులు ఈ దేవుళ్లను దర్శించుకుంటారని చెప్పారు. పావు కేజీ ఉల్లిపాయలు, పప్పులు చెల్లించి తమ కోర్కెలు తీర్చమని భక్తులు కోరతారని తెలిపారు. ఈ ఒక్క మాసంలో దాదాపు 50 నుంచి 70 క్వింటాళ్ల ఉల్లిపాయలు దేవుడికి భక్తులు కానుకగా సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అయితే అలా వచ్చిన ఉల్లిపాయలను మార్కెట్లో విక్రయించి.. వచ్చిన నగదు గురు గోరఖ్నాథ్ దేవాలయం నిర్వహణతోపాటు గోశాలలోని గోవులకు ఆహారం సమకూరుస్తామని తెలిపారు.