నల్లగొండ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. త్రిపురారం మండలంలోని రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
త్రిపురారం: నల్లగొండ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. త్రిపురారం మండలంలోని రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు బాబుసాయిపేట గ్రామంలోని కనకదుర్గ ఆలయంలో దొంగలు పడ్డారు.
ఆలయాల్లోని రెండు హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ. 1.25 లక్షలతో ఉడాయించారు. ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.