సాక్షి, విజయవాడ: విద్యా సదుపాయాల్లో అత్యంత వెనకబడిన మారుమూల గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు నడిపిస్తున్న బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అకాడమీస్‌కు అరుదైన పురస్కారం లభించింది. యూకే ప్రభుత్వ సంస్థ డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(డిఎఫ్‌ఐడీ) తన నివేదికలో బ్రిడ్జ్ అకాడమీస్ అవలంబిస్తున్న విధానాలు, బోదన విధానాలను ప్రశంసించింది. సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ విద్యనభ్యసించే విధానాల్ని అమలుపరుస్తోందని కొనియాడింది. వెనుకబడిన దేశాల్లోనూ సామాజిక ఆర్థిక అసమానతల్ని రూపుమాపడానికి ఆధునిక విద్యావిధానాలతో బ్రిడ్జ్ చేయూతనిస్తుందని ప్రశంసించారు.
కెన్యా, నైజీరియా, లైబీరియా, ఉగాండాలతో పాటు భారత్‌లోనూ వందలాది ప్రైమరీ స్కూళ్లను బ్రిడ్జ్ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఇక ఏపీలోని తమ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్యనందిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి, గుంటూరులోని తేలప్రోలు, పశ్చిమ గోదావరిలో భీమడొలు, ప్రకాశంలోని గిద్దలూరు, చిత్తూరు జిల్లాని చంద్రగిరి, మోరిగానిపల్లి గ్రామాల్లో బ్రిడ్జ్ తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. డీఎఫ్‌డీఐ ప్రశంసలతో తమ లక్ష్యానికి మరింత చేరువయ్యామని బ్రిడ్జ్ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ కోషి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment