institutes
-
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
జుంబా..రే: అందం, ఆరోగ్యం అన్నింటికీ ఒకటే మంత్రం
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఫిట్‌నెట్ సంగీతాలు నేడు ఏజెన్సీ ప్రాంతంలోనూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యువత ఆరోగ్యంతో పాటు అందానికి ప్రాముఖ్యత ఇస్తూ, ఫిట్నెస్ను మెరుగుపర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోనూ ఏరోబిక్స్, జుంబా నృత్యాలు కనిపించడం విశేషం. ఆధునికతను జోడించుకుని బరువు తగ్గించుకునే ఈ పద్ధతికి మహిళల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. అందం, ఆరోగ్యాల కలబోత నయా ఫిట్నెస్ మంత్ర.. నేడు మారిన ఆహార పద్ధతులతో ఊబకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకోవడానికి పురుషులు, మహిళలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో శాస్త్రీయంగా బరువును తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జిమ్‌లు, ఏరోబిక్స్, జూంబా వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటిలో ఏరోబిక్స్, జుంబాలకు ప్రత్యేక శిక్షణ కలిగిన నిపుణులు అవసరమం. అలాంటి ఏరోబిక్స్, జుంబాల ఫిట్నెస్ సెంటర్లు సైతం ఏజెన్సీలోని భద్రాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, వైద్యులు, గృహిణులు ఖాళీ సమయాల్లో సంతోషంగా, ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఫిట్నెస్ను మెరుగుపర్చుకునేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. సులువుగా ఏరోబిక్స్, జుంబా.. బరువు తగ్గించేందుకు ఏరోబిక్స్, జుంబాల శిక్షణను విడివిడిగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా రెండింటినీ కలబోసి ఫిట్నెస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఏరోబిక్స్‌లో ప్లోర్, స్టెప్ వర్కౌట్లు, స్టెప్ ఏరోబిక్స్, బాల్ ఏరోబిక్స్, రోపింగ్లతో సాధన చేయిస్తారు. ఇక జుంబాలో ఆహ్లాదకరమైన సంగీతంతో సులువైన ఆసనాలతో కూడిన నృత్యాలు, ఎక్సర్సైజ్ స్టెప్పులతో ఉంటుంది. రోజుకు ఒక గంటలో చేసే వీటి ద్వారా సుమారు 500 నుంచి 800 వరకు కేలరీస్ ఖర్చవుతాయని శిక్షకులు చెబుతున్నారు. మూడు నెలల్లో 5 నుంచి 8 కేజీల బరువు తగ్గుతారని అంటున్నారు. ఈ సెంటర్లతో చాలా ఉపయోగం గతంలో ఉద్యోగ రీత్యా మెట్రో సిటీలలో ఉండేవాళ్లం. అక్కడ కనిపించే ఫిట్నెస్ సెంటర్లు భద్రాచలంలో కూడా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ప్రతిరోజూ ఫిట్నెస్ సెంటర్‌కు వస్తున్నాను. చార్జీలు సైతం సిటీలో కంటే చాలా తక్కువగా ఉన్నాయి. – శిల్ప, గృహిణి పది కేజీల బరువు తగ్గాను ఎటువంటి ప్రయాసలు, శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుండా అధిక బరువును తగ్గించుకోవటానికి ఇది చాలా సులువైన మార్గం. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..ఏరోబిక్స్, జుంబాలో వర్కవుట్ చేస్తూ మూడు నెలల్లో పది కేజీల బరువు తగ్గాను. – రీనా, గృహిణి వ్యయ, ప్రయాసలతో ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఏరోబిక్స్, జుంబాలను పరిచయం చేయాలనే సంకల్పంతోనే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దీన్ని ఏర్పాటు చేశాం. స్పందన అద్భుతంగా వస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మహిళలైనా, పురుషులైనా బరువు తగ్గించుకోవడానికి ఇది సులువైన మార్గం. – నాగరాజు, ప్రియాంక, క్రేజీ మాస్టర్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకులు, భద్రాచలం -
బ్రిడ్జ్ విద్యాసంస్థలపై యూకే ప్రశంసలు
సాక్షి, విజయవాడ: విద్యా సదుపాయాల్లో అత్యంత వెనకబడిన మారుమూల గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు నడిపిస్తున్న బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అకాడమీస్‌కు అరుదైన పురస్కారం లభించింది. యూకే ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(డిఎఫ్‌ఐడీ) తన నివేదికలో బ్రిడ్జ్ అకాడమీస్ అవలంబిస్తున్న విధానాలు, బోదన విధానాలను ప్రశంసించింది. సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ విద్యనభ్యసించే విధానాల్ని అమలుపరుస్తోందని కొనియాడింది. వెనుకబడిన దేశాల్లోనూ సామాజిక ఆర్థిక అసమానతల్ని రూపుమాపడానికి ఆధునిక విద్యావిధానాలతో బ్రిడ్జ్ చేయూతనిస్తుందని ప్రశంసించారు. కెన్యా, నైజీరియా, లైబీరియా, ఉగాండాలతో పాటు భారత్‌లోనూ వందలాది ప్రైమరీ స్కూళ్లను బ్రిడ్జ్ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఇక ఏపీలోని తమ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్యనందిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి, గుంటూరులోని తేలప్రోలు, పశ్చిమ గోదావరిలో భీమడొలు, ప్రకాశంలోని గిద్దలూరు, చిత్తూరు జిల్లాని చంద్రగిరి, మోరిగానిపల్లి గ్రామాల్లో బ్రిడ్జ్ తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. డీఎఫ్‌డీఐ ప్రశంసలతో తమ లక్ష్యానికి మరింత చేరువయ్యామని బ్రిడ్జ్ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ కోషి పేర్కొన్నారు. -
కెరీర్ కౌన్సెలింగ్
I want to become an air hostess. Please tell me about the institutes that provide the training? - Rupa, Hyderabad ⇒ The basic requirement to pursue career as Air hostess is, formal training in the specific area. Then there are some age, height and weight restrictions. The candidate should have normal eye sight and be proficient in English and Hindi. Proficiency in foreign languages is an added advantage. The recruitment of air hostesses involves stages like written test and interview. The following are the details of some institutes offering air hostess training: ⇒ Fly High Institutes of Air Hostess and Hospitality, Sri Nagar Colony, hyderabd offers six-months diploma in Air hostess training. The eligibility criteria are +2 as academic qualification and age between 18-24. The admission is based on performance at personal interview. ⇒ Avalon Academy, Masab Tank, hyderabd. offers Diploma in Cabin Crew. The eligibility criterion is +2. - T. Muralidharan T.M.I. Network -
ఉమ్మడి సంస్థల నిధుల స్తంభన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 7, 9, 10వ షెడ్యూళ్లలోని సంస్థలకు చెందిన నిధులను స్తంభింపజేయాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా.. తమకు తెలియజేయకుండా ఎటువంటి లావాదేవీలను కొనసాగించరాదంటూ బ్యాంకులకు సర్క్యులర్లు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఏకపక్ష ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్ర నిధులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించరాదని, విషయం ఏదైనా తమకు తెలియజేయాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీ సర్కార్ తన సర్క్యులర్‌లో పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టంలోని పలు షెడ్యూళ్లలో పేర్కొన్న పలు సంస్థలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవైనందున వాటి నిధులు కూడా ఉమ్మడి రాష్ట్రం కిందకే వస్తాయని, అందువల్ల ఆ నిధులను ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేయకుండా ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను కోరింది. దీనిపై బ్యాంకులు ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ బ్యాంకులకు మరో సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని, యధాప్రకారం ఆయా సంస్థల అథారిటీల ఆదేశాల మేరకు ఆర్థిక లావాదేవీలను కొనసాగించాలని పేర్కొంది. ఈ విషయంలో టీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వివాదాలను పరిష్కరించుకుని, బ్యాంకింగ్ కార్యకలాపాలపై సంయుక్తంగా ఆదేశాలు ఇస్తేనే అమలు చేయాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఉమ్మడి సంస్థల్లోని నిధులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌కు చెందిన రూ.35 కోట్లను ఏపీ ప్రభుత్వానికి చెప్పకుండా బదిలీ చేసుకోవడంతో.. ఏపీ ప్రభుత్వం స్పేస్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన రూ.22.50 కోట్ల నిధులను తెలంగాణకు సమాచారం ఇవ్వకుండానే విజయవాడకు బదిలీ చేసుకుంది. అలాగే కార్మిక సంక్షేమ నిధికి చెందిన నిధులను కూడా బదిలీ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు సర్క్యులర్లు జారీ చేశాయి. ఆయా సంస్థల్లో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన డిపాజిట్లు గానీ, నిధులు గానీ సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ఈ నిధులను స్తంభింపజేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వేర్వేరుగా జారీ చేసే ఆదేశాల మేరకు వాటిని విడుదల చేయరాదని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలూ ఒక అంగీకారానికి రావాల్సి ఉందని, త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.