గుర్తు తెలియని వృద్ధుడి మృతి
Published Sun, Mar 5 2017 7:37 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
దుర్గి: గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం జరిగింది. శనివారం సాయంత్రం నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్లాలని అడిగొప్పల చేరుకుని ఆటోలు లేకపోవటంతో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బస చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆ వృద్ధుడు మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న దుర్గి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. వృద్ధుడి వయసు సుమారు 75 సంవత్సరాలు ఉండవచ్చని, తెల్లపంచ, తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. అతని వద్ద సంచిలో దుప్పటి, కండువా, జేబులో బస్సు టికెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వృద్ధుడు నర్సరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement