లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం పోస్టర్
నెల్లూరు(క్రైమ్): దసరాకు ఊరెళుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పోలీసు అధికారులు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య, వ్యాపారాలు ఇలా అనేక అవసరాల నిమిత్తం పల్లెసీమల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు నగరానికి, పట్టణాలకు వచ్చి ఇక్కడే నివాసముంటున్నారు. దసరా పండగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా భావించి చోరులు విజృంభించి దోచుకెళ్లే అవకాశం ఉంది. అంతా అయిపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించి బోరున విలపించడం కన్నా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని పేర్కొంటున్నారు. అదేక్రమంలో ప్రయాణంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
అందుబాటులో యాప్
ఇళ్ల దొంగతనాలను నివారించేందుకు పోలీసుశాఖ ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నెల్లూరు నగరవాసులు ఊరెళుతుంటే ఆ శాఖ రూపొందించిన ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం)ను తమ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఊరు ఎప్పుడు వెళుతున్నారు?, తిరిగి ఎప్పుడు వస్తారు?, తదితర వివరాలను యాప్‌లో నమోదు చేస్తే పోలీసులు ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా పెడతారు. ఇంట్లో వైర్‌లెస్‌తో కూడిన మోషన్ కెమెరాను, వైఫైని ఏర్పాటుచేస్తారు. ఇంటి యజమాని సెల్‌ఫోన్‌తో పాటు కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తారు. ఇంట్లో దొంగలుపడితే వెంటనే ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ పోలీసులను, ఇంటి యజమానిని అప్రమత్తం చేస్తుంది. దీంతో పోలీసులు ఆ ఇంటివద్దకు చేరుకొని నేరగాళ్లను పట్టుకునే అవకాశం ఉంది.
అప్రమత్తత అవసరం
ఇటీవల రైళ్లలో చోరీలు అధికమయ్యాయి. ప్రయాణికులు ఏమరపాటుగా ఉంటే చాలు దొంగలు విలువైన వస్తువులను తస్కరించేస్తున్నారు. కిటీకి పక్కన కూర్చొన్న మహిళలు మెడల్లో బంగారు ఆభరణాలు తెంచుకుపోవడం, బ్యాగులు, ఇతర విలువైన సామగ్రి అపహరించుకుని వెళతారు. ఆర్టీసీ ప్రయాణాల్లో దొంగతనాలు అధికమయ్యాయి. రద్దీగా ఉండే బస్టాండ్‌ల్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు.
ఇలా చేయాలి
4ప్రయాణికులు తమ సామాన్లకు గొలుసులు ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి.
4సాధారణ బోగీల్లో ర్యాక్‌లపై సామగ్రిని ఉంచకూడదు.
4మహిళలు చేతి బ్యాగుల విషయంలో ప్రత్యేకశ్రద్ధ వహించాలి.
4కిటికీల వద్ద ఆభరణాలు ధరించి నిద్రించరాదు.
4అపరిచితులతో ఎక్కుగా స్నేహం చేయకూడదు.
4తెలియని వారు ఏమి ఇచ్చినా తినకూడదు. తాగకూడదు.
4అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలి.
ముఖ్యమైన ఫోన్ నంబర్లు
నగర డీఎస్పీ 9440796303
చిన్నబజారు పోలీస్‌స్టేషన్ 0861–2328410, 9440796305
నవాబుపేట పోలీస్‌స్టేషన్ 0861–2328420, 9440796306
సంతపేట పోలీస్‌స్టేషన్ 0861–2331430, 9400700097
దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ 0861–2328440, 9440796308
వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ 0861–2366058, 9440796304
బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ 0861–2327766, 9440796311
నెల్లూరు సీసీఎస్ 0861–2327647, 9440700091
నెల్లూరు రైల్వే డీఎస్పీ 0861–2331169, 9440627391
నెల్లూరు రైల్వే సీఐ 0861–2331423, 9440627645
డయల్ 100, 1090
Comments
Please login to add a commentAdd a comment