వాతపెట్టి వెన్న రాస్తున్నారు! | vamsadhara Village Victims Fired on TDP | Sakshi
Sakshi News home page

వాతపెట్టి వెన్న రాస్తున్నారు!

Published Sat, Feb 2 2019 8:36 AM | Last Updated on Sat, Feb 2 2019 8:36 AM

vamsadhara Village Victims Fired on TDP - Sakshi

న్యాయం కోసం రోడ్డెక్కిన నిర్వాసితులపై లాఠీచార్జి చేస్తున్న పోలీసులు (ఫైల్‌)

వాతపెట్టి వెన్న పూసినట్టుంది వంశధార నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం తీరు. నాలుగున్నరేళ్లుగా నరకాన్ని చూపించిన సర్కార్‌ ఇప్పుడు కేసులు ఎత్తివేసినట్టుప్రకటన చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కేసులు ఎత్తివేత తెరపైకి తెచ్చారన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు తాము ఎలా ఉన్నామో.. ఏం చేస్తున్నామో కనీసం పట్టించుకోకుండా..
తమ త్యాగాలకు విలువ లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం కేసుల ఎత్తివేతను సాకుగా చూపి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంపై పునరావాస కాలనీల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు పెదవివిరుస్తున్నారు. గుండెల్లో మానని గాయాన్ని రేపి మందురాసే ప్రయత్నం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతోనే సర్కార్‌ దిగి వచ్చిందని ప్రజలంటున్నారు.

శ్రీకాకుళం, హిరమండలం,కొత్తూరు: భవిష్యత్‌ తరాల కోసం సర్వం త్యాగం చేసి నిర్వాసితులుగా మారిన వారిపై ప్రభుత్వం కపట ప్రేమ నటిస్తోంది. వంశధార ప్రాజెక్టు నిర్మాణంతో ఆస్తులను కోల్పోయిన తమకు తగిన పరిహారం, ప్యాకేజీ అందించి ఆదుకోవాలని కోరితే ఆగ్రహిం చిన టీడీపీ సర్కార్‌ అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందని.. ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసులు ఎత్తివేస్తున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని నిర్వాసితులంటున్నారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేసిన సుమారు 1200 మందిపై సర్కార్‌ పోలీసులు కేసులను గతంలో పెట్టించిం ది. అయితే వీరిపై కేసులు ఎత్తివేయాలనిరాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. అయితే ఇన్నాళ్లు లేని ప్రేమ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒలకబోస్తుండడాన్ని నిర్వాసితులు తప్పుపడుతున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వాన్ని నమ్మమని తేల్చి చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

పరిస్థితి ఇలా..
వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా హిరమండలం మండలంలోని దుగ్గుపురం, పాడలి, తులగాం, పెద్దసంకిలి, చిన్నకొల్లివలస, గార్లపాడు పంచాయతీలు,  ఎల్‌.ఎన్‌. పేట మండలంలోని పెద్ద కొల్లివలస పంచాయతీ, కొత్తూరు మండలంలోని ఇరపాడు పంచాయతీ పరిధిలోని 19 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. అయితే నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేసింది. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదు. ప్యాకేజీలు, పరిహారాలు చెల్లించలేదు. నిర్వాసిత రైతులు సాగు చేసిన పంట పొలాలను పోలీసుల సాయంతో ధ్వంసం చేశారు. దీంతో నిర్వాసితుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితుంటున్న ప్రాంతంలో పర్యటించి నిర్వాసితుల తరఫున గళమెత్తారు. దీంతో ప్రభుత్వం దిగు వచ్చింది. ముందుగా యూత్‌ప్యాకేజీలు, పరిహారాల పేరుతో రూ.420 కోట్లు విడుదల చేసింది. కానీ ఇందులో కూడా నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధి నుంచి గ్రామాల్లో అధికా ర పార్టీ చోటా నాయకులు, బినామీల పేరిట యూత్‌ ప్యాకేజీలను కైంకర్యం చేశారు. వేలాదిమంది నిర్వాసితులకు ఇతర ప్యాకేజీలు, నష్టపరిహారం అందించలేదు.

పునరావాసం కల్పిం చలేదు. ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా రిజర్వాయర్‌ పనులపైనే దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. 2017 జనవరి 22వ తేదీ భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులంతా కదలివచ్చి రిజర్వాయర్‌ పనులను అడ్డుకున్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారని భావించి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీల కు చెందిన నిర్మాణ సామగ్రి, యంత్రాలు ధ్వంసం చేశారు. జనరేటర్‌తో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రూ.4 కో ట్లు నష్టం వాటిల్లినట్లు సంబంధిత కంపెనీ చెప్పుకొచ్చింది. అం తనష్టం జరగలేదని నిర్వాసిత సంఘ నాయకులు, విపక్షాలు మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం సుమారు 1200 మందిపై 16 రకాల కేసులు పెట్టిం చింది. వీటిలో ఆరేడు కేసులు నమెదైన వ్యక్తులున్నారు. త్యాగా లకు విలువ లేకపోగా.. తమకు న్యాయపరంగా రావల్సిన పరిహారం మంజూరు కాకపోవడంతోనే తామంతా రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని నిర్వాసితులు చెప్పినా ప్రభుత్వం వినలేదు. ఏళ్ల తరబడి ఉంటున్న గ్రామాల నుంచి బలవంతగా పోలీసుల సాయంతో ఖాళీ చేయించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను సైతం నేలమట్టం చేశారు. ఒక్క నెల గడువు అడిగినా పాలకులు, ప్రభుత్వం పట్టించుకోలేదు.

జగన్‌ హామీతో..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం మెళియపెట్టిలో గత ఏడాది డిసెంబర్‌ 24వ తేదీన జరిగిన బహిరంగ సభలో వంవధార నిర్వాసితులపై ఉన్న కేసులన్నీ ఎత్తువేస్తామని ముందుగానే ప్రకటించారు. దీంతో నిర్వాసితులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నిర్వాసితులకు దగ్గరవ్వాలని చూస్తున్న చంద్రబాబు నిర్వాసితులపై నమోదు చేయించిన కేసులను ఎత్తివేస్తున్నట్టు చేసిన ప్రటనను ప్రజలు గమనిస్తున్నారు.

ఇది ఎన్నికల స్టంటే
నిర్వాసితుల పక్షాన పోరాడుతున్నాననే అక్కసుతో ప్రభుత్వం అన్నిరకాల కేసులు తనపై మోపింది. కొద్ది రోజులు కుటుంబాన్ని వదిలి అజ్ఞాత జీవితాన్ని సైతం గడిపాను. భార్య, పిల్లలు ఆకలితో అలమటించారు. నిర్వాసితులుగా మారిన మాకు న్యాయంగా రావల్సిన నష్టపరిహారాలతో పాటు మెరుగైనా ప్యాకేజీ అందించాలని మాత్రమే తాము కోరాం. కానీ ప్రభుత్వం తమపై కక్షకట్టే విధంగా వ్యవహరించింది. ఇప్పుడు కేసుల ఎత్తివేత ఎన్నికల స్టంటే. – గొర్లె మోహన్‌రావు, నిర్వాసితుడు పాడలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement