
జేసీ బ్రదర్స్ విషయం.. చంద్రబాబును అడగాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికారిక తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ సీపీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
వంగవీటి మోహన రంగా, తదితరులపై జరిగిన హత్య కేసుల్లో టీడీపీ నేతలే ముద్దాయిలుగా ఉన్నారని వంగవీటీ రాధా అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలున్న జేసీ దివాకర రెడ్డి సోదరులను ఎలా టీడీపీలోకి చేర్చుకున్నారో చంద్రబాబు నాయుడును అడగాలని మంత్రి పరిటాల సునీతకు సూచించారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై న్యాయ, సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు హత్యారాజకీయాలు మాని ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వంగవీటి రాధా హితవు పలికారు.