‘బియాస్’ దుర్ఘటనలో దుర్మరణం చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట తప్పుతున్నారని పేర్కొంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై ‘బియాస్’ బాధితుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘బియాస్’ దుర్ఘటనలో దుర్మరణం చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట తప్పుతున్నారని పేర్కొంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మరో ప్రభుత్వం ఇవ్వాలో లేదో పరిశీలిస్తున్నామని చెప్పడమేంటని ఆక్షేపించారు. బియాస్ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు లేక్‌వ్యూ అతిథి గృహంలో సోమవారం చంద్రబాబును కలిశారు. పరిహారం విషయాన్ని ప్రస్తావించగా సీఎం విముఖత వ్యక్తం చేశారు. అనంతరం, మృతుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించిన నేపథ్యంలో తాము కూడా చెల్లించాలా? ఈ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తాం అని బాబు అన్నట్టు చెప్పారు.