సమసమాజ స్థాపనకు కృషి చేయాలి
అనంతపుురం కల్చరల్ :
మహాకవి గుర్రం జాషువా స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జాషువా 119వ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నగరంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో హుస్సేన్‌సాబ్, డెప్యూటీ మేయర్ గంపన్న, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాలవారు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జాషువా సాహిత్య పీఠ సాధన కమిటీ, జెన్నే పబ్లికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాషువా జయంతి నిర్వహించారు. సాహితీ సదస్సుకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జయరాజ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ వాస్తవికత, సామాజికత, ఆధునికత అనే పునాదులపై తెలుగు కవిత సరికొత్త రూపాన్ని సంతరించుకుందని అభిప్రాయపడ్డారు, నూతన సామాజిక కవిత్వాన్ని గురుజాడ ప్రారంభిస్తే దానిని శ్రీశ్రీ, జాషువాలు కొనసాగించారన్నారు. నేటి తరం సాహిత్యంతో సామాజిక అభ్యున్నతి కోసం కృషి చేయాలన్నారు. అనంతరం హనుమంతరాయ చౌదరి, ఆచార్య జయరాజ్, లిటిల్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఆంజనేయులు గౌడ్, జెన్నే ఆంజనేయులు, కథా రచయితలు శాంతి నారాయణ, జిరసం అధ్యక్షుడు ప్రేమ్‌చంద్, ఆచార్య సుధాకరబాబు, అమ్మిశెట్టి తులసీకృష్ణ, అంకె రామలింగయ్య తదితరులను ఘనంగా సత్కరించారు. జాషువా సాహిత్యంపై క ళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృ త్వం, పద్యపఠన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జాషువా సాహిత్య పీఠ సాధన కమిటీ సభ్యులు తోట నాగరాజు, కార్పోరేటర్ బంగి సుదర్శన్, అగ్రికల్చర్ ఎడి రంగస్వామి , పండిట్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
మాదిగ ఉద్యోగుల సమాఖ్య నివాళి
అనంతపురం టవర్‌క్లాక్ : నగరంలోని మహాకవి గుఱ్ఱం జాషువా విగ్ర హానికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య పూలమాలలు వేసి నివాళులర్పించింది. సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ మాట్లాడుతూ సమాజ చైతన్యానికి జాషువా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహాకవి జయంతి వేడుకలను ప్రతి జిల్లాలోనూ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర, రాష్ట్ర కార్యదర్శి అమర్‌నాథ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు, ఉపాధ్యక్షుడు న రసింహులు, కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.