ఎలమంచిలి అటవీశాఖ కార్యాలయంపై విజిలెన్స్ దాడి | Vigilance raid in forest office at yelamanchili in vishakapatnam district | Sakshi
Sakshi News home page

ఎలమంచిలి అటవీశాఖ కార్యాలయంపై విజిలెన్స్ దాడి

Published Tue, Sep 17 2013 10:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

Vigilance raid in forest office at yelamanchili in vishakapatnam district

ఎలమంచిలిలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశాఖపట్నం తీర ప్రాంతంలోని ఇసుక అక్రమ రవాణాపై అటవీ శాఖ సిబ్బందిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందులోభాగంగా దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

 

అంతేకాకుండా రికార్డులను పరిశీలిస్తున్నారు. తీర ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేసే క్రమంలో లక్షలాది రూపాయిలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు అటవీశాఖ కార్యాలయంపై దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement